ఆషాఢ మాసంలో ఆడవాళ్లు గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి.. ఎందుకో తెలుసా?


గోరింటాకును ఆషాఢం మాసంలో మహిళలు తప్పనిసరిగా పెట్టుకుంటారు. కాని ఇలా గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారో మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు అంటే తగ్గింది కాని.. కొన్ని ఏళ్ల క్రితం వరకు ఆషాడం వచ్చిందంటే ఆడవాళ్ల అరచేతులన్నీ గోరింటాకుతో మెరిసిపోయేవి. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.

అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా మంచిదని చెబుతున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇటు ఆరోగ్యపరంగానూ, అటు ఆధ్యాత్మకంగానూ ఎన్నో ప్రయోజనాలున్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీని వల్ల మంచి హెల్త్ తో పాటుగా చేతులు ఎర్రగా పండి అందం, ఆకర్షణ ఇనుమడిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)