ఎత్తు విషయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే పొడుగ్గా కనిపించవచ్చు


డ్రెస్సింగ్ విషయంలో చిన్ని చిన్న మెళకువలు పాటిస్తే మరింత అందంగా కనిపించడమే కాదు, మనలోని భౌతిక లోపాలను కూడా ఎదుటివారు గుర్తించకుండా చేసుకోవచ్చు. కొన్ని విధానాలు ప్రతికూల ప్రభావం చూపి సమస్యలను మరింత జటిలం చేస్తాయి. ముఖ్యంగా ఎత్తు విషయంలో చాలా మంది ఉండాల్సిన దాని కంటే తక్కువ ఉన్నామని తెగ బాధపడిపోతారు. ఇలాంటి వాళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ లోపం కారణంగా ఎదురయ్యే ఆత్మన్యూనతా భావం నుంచి బయటపడవచ్చు. ఆలాగే పొడుగ్గానూ కనిపించవచ్చు.
సాధారణంగా మన ఎత్తు అనేది పుట్టుకపై ఆధారపడి ఉంటుంది. ఇది జన్యుపరంగా సంక్రమిస్తుంది. ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. కుటుంబ వారసత్వం ఆధారంగా పొడుగు, పొట్టి అనేది ఉంటుంది. అయితే చిన్న చిట్కాలతో పొడుగ్గా కనిపించడం కష్టం కాదు. నిటారుగా నిలబడటం, కూర్చోవడం వల్ల పొడుగ్గా కనిపించవచ్చు. నడిచేటప్పుడు వంగడం వల్ల ఇంకా పొట్టిగా కనపడతారు.

దుస్తులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని రకాల దుస్తులు పొడుగ్గా కనపించడానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా చెక్స్ డిజైన్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనపడేలా చేస్తాయి. ఏక రంగు, నిలువు చారలు ఉండే దుస్తులు వేసుకుంటే పొట్టిగా ఉన్నామనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అడ్డంగా ఉండేవి కాకుండా నిలువుగా ఉండే డిజైన్లు వాడటం మరచిపోకండి.
ఇది చాలా సులువైన చిట్కా. బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే ఉన్న దానికంటే తక్కువ ఎత్తులో కనబడతారు. అదే బిగుతుగా ఉండే దుస్తుల వల్ల మరింత పొడుగ్గా ఉన్నామనే భావన కలుగుతుంది. జీన్స్ లేదా ఇతర ఆధునిక దుస్తులు ధరించినప్పుడు దాని చివర ఓపెన్‌గా కాకుండా టైట్‌గ ఉండేలా చూసుకోండి. అంతే కాదు ఇవి చీలమండలు పైవరకు ఉంటే ఇంకా పొడుగ్గా కనపడవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)