వీళ్ళ వయసు తెలిస్తే నిజమేనా అంటారు కానీ ఇది పక్క నిజం.. ఇంతకీ వీళ్ళ సీక్రెట్ ఏంటంటే


అరవైలో ఇరవైలా కనిపించాలని ఉందా? అయితే, ఆ సీక్రెట్ ఏమిటో ఆ బామ్మగారినే అడిగేద్దాం. సారీ, బామ్మ అంటే ఆమెకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె తన కూతుర్ల కంటే యంగ్‌గా కనిపిస్తోంది మరి. లురే హసు అనే 41 ఏళ్ల మహిళ 20 ఏళ్ల యువతిలా కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకోడానికి సోషల్ మీడియాలో చాలామంది ఆమె వ్యక్తిగత వివరాలు కోసం లోతైన పరిశీలన జరిపారు.
ఈ సందర్భంగా ఆమె ‘ముగ్గురు’ చెల్లెల్లు కూడా యంగ్‌గానే కనిపిస్తున్నారని తెలుసుకున్నారు. అయితే, మరికాస్త లోతైన పరిశీలన తర్వాత.. ఆమెకు ఉన్నది ఇద్దరు చెల్లెల్లు మాత్రమేనని ఇంకోకరు.. తన 63 ఏళ్ల తల్లి అని తెలిసి అంతా ఖంగుతిన్నారు. ఇంకేముంది.. 41 ఏళ్ల లూరేని పక్కన పెట్టేసి.. నెజిన్లంతా 63 ఏళ్ల బామ్మ వెంట పడ్డారు.

ఇంతకీ వాళ్లు ఇంత యంగ్‌గా కనిపించడం వెనుక సీక్రెట్ ఏమిటని ఆరా తీస్తే... రోజూ లీటర్ల కొద్ది నీళ్లు తాగడం, కూరగాయలు మాత్రమే  తింటామని చెప్పారు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే శరీరంపై ముడతలే రావని చెప్పారు. తైవాన్ మీడియా.. వారిని ‘The family of frozen ages’ అని కితాబిచ్చింది. వాళ్లు తమ వయస్సు పెరగకుండా ఫ్రీజ్ చేశారని కొనియాడింది. అరవైలోనూ ఇరవైలా కనిపించడమంటే నిజంగా అద్భుతమే కదూ!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)