ఈ పని చేస్తే ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి

Loading...

ఇంటిలో ఎలుకలు పుస్తకాలు మరియు బట్టలను పాడుచేస్తాయి. అలాగే వాటి మూత్రం మరియు మలం ద్వారా అనేక అంటువ్యాధులు వస్తాయి. ఎలుకలతో విసుగు చెందినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో అనే ఆలోచనలో పడతాం. అయితే ఇక్కడ చెప్పుతున్న సులువైన మార్గాల ద్వారా ఎలుకలను వదిలించుకోవచ్చు.
కలరా ఉండల బలమైన వాసన ఎలుకలను తరిమి కొడుతుంది.
కావలసినవి


 • చిన్న కంటైనర్లను తీసుకోని వాటికీ రంద్రాలు చేయాలి.
 • ఈ చిన్న కంటైనర్లలో రెండు లేదా మూడు కలరా ఉండలను ఉంచాలి.
 • ఈ చిన్న కంటైనర్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంచాలి.
 • ఈ విధంగా చేయుట వలన ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క బలమైన వాసన ఎలుకలకు పడదు. కాబట్టి అవి పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి పారిపోతాయి. ఎలుకలు ఇంటిలోకి ప్రవేశించగానే ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి సహాయపడుతుంది.

 • పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి.
 • సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి.
 • ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
 • అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.
ఎలుకలు బలమైన లవంగం ఎసెన్షియల్ ఆయిల్ వాసనను భరించలేవు. లవంగం వాసన ఉన్న చోటు నుండి ఎలుకలు పారిపోతాయి. దీని కోసం లవంగాలు లేదా లవంగాల నూనెను ఉపయోగించవచ్చు.

 • లవంగం ఎసెన్షియల్ ఆయిల్ లో కాటన్ బాల్ ని ముంచాలి.
 • ఈ కాటన్ బాల్స్ ని తలుపుల దగ్గర మరియు ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెట్టాలి.
 • అలాగే ఒక కాటన్ క్లాత్ లో కొన్ని లవంగాలను వేసి ర్యాప్ చేసి ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెట్టవచ్చు.
 • ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...