గడ్డం పెంచడం వలన ఎన్నో లాభాలు.. అమ్మాయిలను ఆకట్టుకోవడం కూడా.. ఎలా ఉంటే అమ్మాయిలకు ఇష్టమో తెలుసా


బెస్ట్ లుకింగ్ కోసం ఇప్పుడు అబ్బాయిలు అనేక షేవింగ్ స్టయిల్స్ అనుసరిస్తున్నారు. అందులో అమ్మాయిలను ఆకట్టుకోవడం కూడా అంతర్లీనంగా ఉంటుందనేది నేటి జనరేషన్ మాట. అయితే తాజాగా చేసిన ఓ పరిశీలనలో అబ్బాయిల అభిప్రాయం కూడా కరెక్టేనని వెల్లడయింది. అమ్మాయిలు షేవ్ చేయని గడ్డం ఉన్న అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడ్తున్నారు. అందుకే షేవ్ చేసుకోకుండా ఉంటే అమ్మాయిలకు అందంగా కనిపించడం ఒక్కటే కాకుండా.. ఫుల్ గడ్డం పెంచడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయట. నిపుణులు ఇటీవల వెల్లడించిన గడ్డానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా గడ్డం పెంచుతారు.
గడ్డం పెంచుకోవడం వలన అది మిమల్ని సూర్యరశ్మి నుండి కాపాడుతుంది. దానివల్ల ఎప్పుడు మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు.

  • ప్రతిరోజు షేవింగ్ చేసుకోవడం వలన బ్యాక్టీరియా ఏర్పడి ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుకే గడ్డం పెంచుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేవి రావు.
  • మొహం పైన గడ్డం బాగా ఉండటం వలన మీ గొంతులోకి అనేవి బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించదు. గొంతునొప్పి మరియు గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా దూరం చేయొచ్చు.
  • చర్మం నేచుర‌ల్ ఆయిల్స్ ని కలిగి ఉండడం వల్ల మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ కోల్పోతుంది. ఒకవేళ గడ్డం ఉంటే.. న్యాచురల్ మాయిశ్చరైజ్ అలాగే ఉంటుంది.
  • మీకు ఆస్తమా వంటి సమస్య రాకుండా గడ్డం అనేది కాపాడుతుంది. ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు, గడ్డం అడ్డుకుంటుంది. టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది.
  • స్కిన్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.అదే విధంగా యూవీ కిరణాల నుంచి 95 శాతం రక్షణ కలుగుతుంది.
  • గడ్డానికి లైంగిక శక్తికి సంబంధం ఉంది. అంటే లైంగిక సామర్థ్యం ఎక్కువగా ఉన్న కారణంగా టెస్టోస్టెరాన్ పై ప్రభావం చూపి గడ్డం పెరగడానికి సహాయపడుతుంది.
  • చివరి పాయింట్ గడ్డం ఉండటం వల్ల అమ్మాయిలకు మీరు తొందరగా నచ్చేస్తారు. ఎందుకంటే గడ్డం వల్ల మీరు ఎట్రాక్టివ్ గా మరియు కాన్ఫిడెంట్ గా ఉంటారు. స్టయిలిష్ గడ్డం అయితే ఇక అమ్మాయిలకు తిరుగులేకుండా నచ్చేస్తారట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)