కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

Loading...

కలియుగ దైవం నెలకొన్ని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఆయన లీలలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా శ్రీవారి లీల మరొకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. కాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తుంటాయి. మానవులకే ఇన్ని ఇబ్బందులైతే ఇక జంతువుల విషయం చెప్పాలా. అలాంటిది జంతువులు మెట్లు ఎక్కి తిరుమలకు వెళితే...? అవును.. ఒక గోవు కాలినడకన తిరుమలకు చేరుకుంది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఒక గోవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి తిరుమలకు చేరుకుంది. కాలినడక మార్గంలోనే భక్తులతో కలిసి గోవు ఎక్కింది. గోవును చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ఆ గోవుకు కుంకుమ బొట్లు పెట్టారు. కొంతమంది గోమాతకు నమస్కరించారు. మరికొంతమంది అరటిపండ్లు, కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు.

ఒక గోవు మెట్లు ఎక్కి తిరుమలకు వెళ్ళడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. తిరుమలకు వెళ్ళిన గోవును టిటిడి అధికారులు గుర్తించి ఆ గోవును తిరుమలలోని గోశాలకు తరలించారు. గోవుకు సరిపడా మేతను అందిస్తున్నారు టిటిడి అధికారులు. గోశాలలోని గోవును చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...