మంగళసూత్రం విషయంలో ఈ నియమాలు పాటిస్తే అయిదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది


పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం మరియు నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్దిస్తుంది అదేమిటో ఇప్పుడు చూద్దాము.
తాళి బొట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:-
ప్రతి శుక్రవారం మరియు మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని 
మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగా చేస్తే అయిదవతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది.మంగళసూత్రాలకు పిన్నిసులు మరియు ఏ ఇతర ఇనుముకి సంభందించినవి పెట్టకూడదు.
మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. 
మంగళసూత్రాకి ఎప్పుడు ఎరుపు (పగడం) మరియు నలుపు పూసలు ఉండాలి.
పొరపాటున మంగలసుత్రాలు పెరికిపోతే(తెగిపోతే) ఏమి చెయ్యాలి?
వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి. 
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)