రైలు బోగి వెనుక ఎక్స్ (X) సింబల్ ఎందుకు ఉంటుందో తెలుసా ?


కొన్ని విషయాలు రోజు వింటున్నా.. అవి అంత వింతగా అనిపించవు. ఎవరో ఒకరు వాటి గొప్పతనం చెబితే కాని అర్థం కాదు. అలానే కొన్ని వస్తువులు రోజూ చూస్తున్నా.. అలా ఎందుకు చేశారో, వాటి అర్థం ఏంటో పట్టించుకోం.. మీరెప్పుడైనా ట్రైన్ ఎక్కారా..? లేదా మీ ముందు నుంచి ట్రైన్ వెళిపోతుంటే.. పెద్ద గుర్తుతో.. ఇంటూ సింబల్ ఉండటం గమనించారా.. అది ఎందుకు పెట్టారో..? అంత పెద్దగా రైలు చివర మాత్రమే ఎందుకు పెట్టారో ఆలోచించారా..? ప్రతి రైలు ఆఖరి బోగీపై పెద్ద ఇంటూ గుర్తు లేదా ఎక్స్‌ గుర్తు ఉండడం చాలా సార్లు గమనించి ఉంటారు. అది ఒక గుర్తు మాత్రమే కాదు ఒక సంకేతం కూడా. అదేమంటే… ఈ రైలు బోగీల్లో ఇదే చివరిది అని దాని అర్థం. ఇంకాస్త పరీక్షగా చూస్తే… ‘ఎల్‌వి’ అని ఆ బోగీ ఎడమ వైపు కింది భాగంలో ఒక చిన్న పాటి బోర్డు కూడా కనిపిస్తుంది. అంటే లాస్ట్‌ వెహికల్‌ అని అర్థం. వీటితో పాటు ఉండే మరో అతి ముఖ్యమైన సంకేతం ఆ బోగీ కింది మధ్యభాగంలో ఉండే ఎర్ర లైటు. ఇవన్నీ రైలు ఆఖరి బోగీని సూచించే సంకేతాలు. రాత్రి వేళల్లో లైటు, పగటి వేళల్లో ఇంటూ మార్క్‌ తేలికగా గమనించగల సంకేతాలు కాబట్టే వాటికి అంత ప్రాముఖ్యం. ఈ సంకేతాలలో ఏదో ఒకటి లేకపోతే మాత్రం ఆ రైలు ప్రమాదవశాత్తూ పూర్తి బోగీలు లేకుండా నడుస్తోందని అర్థం…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)