గ్రీన్ టీ లేదా ఏదైనా టీ బ్యాగులను వాడుతున్నారా ? అవి ఎంత డేంజరో తెలిస్తే జీవితంలో టీ బ్యాగ్స్ వాడరు


  • బ్లాక్ లేదా గ్రీన్ టీ ఏదైనా టీ బ్యాగుల కన్నా టీపొడి చాలా మంచిది. టీ బ్యాగుల వల్ల చాలా సమయం కలిసొస్తుంది. వాటిని కేవలం నీటిలో ముంచగానే మీ టీ తయారైపోతుంది. కానీ అవి చాలా హానికరం!
  • ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన ప్రకారం, టీ బ్యాగులు అనేక కారణాల వల్ల మంచివి కాదు. వాటిని తయారుచెయ్యడానికి వాడిన పదార్థాలు, అవి ఎలా వాడారన్న అనేక కారణాల వల్ల అవి సురక్షితమా కాదా అని నిర్ణయించబడతాయి. వాటి గూర్చి మరిన్ని వాస్తవాలు తెలుసుకోండి.
  • మీరు టీ బ్యాగ్ ను వేడి నీటిలో ముంచారనుకోండి, చిన్నచిన్న బుడగలు లేదా నురుగు రావటం చూస్తారు. అది మంచి విషయం కాదు. ఎపిక్లోరోహైడ్రిన్ అనే కార్సినోజన్ (క్యాన్సర్ కారకం) బ్యాగ్ ల గోడలకు పూతలాగా పడుతుంది. ఇదే వేడినీటిలో నురగను సృష్టిస్తుంది.
  • కొన్ని రకాల టీ బ్యాగ్ లు అయితే నైలాన్, ఇంకా పివిసితో కూడా తయారవుతాయి! ఇవి వేడినీటిలోకి చేరినప్పుడు వివిధ రకాల రసాయనిక మార్పులు చెందుతాయి. అది ఆరోగ్యానికి హానికరం.
  • మెజారిటీ టీ బ్యాగుల రకాల్లో క్రిమిసంహారకాలు, కృత్రిమ పదార్థాలు రుచికై వాడారని తేలింది.
  • సాధారణంగా, పేపర్ టీ బ్యాగులను ఎపిక్లోరోఫైడ్రిన్ అనే పదార్థంతో కలుపుతారు. ఈ పదార్థం నీటిలోకి చేరినప్పుడు అది కార్సినోజన్ గా మారుతుంది. అది వ్యాధినిరోధక వ్యవస్థ, పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
  • కొన్ని టీ బ్యాగులు థర్మోప్లాస్టిక్, నైలాన్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ లేదా పివిసితో కూడా తయారవుతాయి. ఇలాంటి పదార్థాలు సహజంగానే అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. అయినా కూడా, మరిగిన నీటితో అవి కలిసినప్పుడు అవి కొన్నిరకాల పదార్థాలను విడుదల చేస్తాయి.
  • మరి టీ త్రాగటానికి సురక్షితమైన పద్ధతి ఏంటి అంటారా ?  టీ పొడిని తెచ్చుకుని, నీటిలో మరిగించి, ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)