జస్ట్ ఈ పేస్టు తలకి రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.. పలుచబడిన చోట వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి


జుట్టు రాలడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది ఇప్పటి తరానికి. కారణాలు ఏమైనా తలపై వెంట్రుకలు లేకపోతే తలెత్తుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు ముఖానికి ముందు భాగాన జుట్టు రాలిపోయి చాలా పలుచబడుతోంది. దీంతో తల ముందు మొత్తం బోసిపోయి ఎంత మంచి హెయిర్ స్టయిల్ ఉన్నా వేస్టే.. అందుకే వెంట్రుకలు ఎక్కడైతే పల్చబడుతున్నాయో అక్కడ కాన్సన్ ట్రేషన్ చేయాలి. కింద చెప్పిన విధంగా వంటింటి పదార్థాలతో పేస్ట్ తయారు చేసుకుని వెంట్రుకలు రాలిపోయి పల్చబడిన చోట రాస్తే చాలు.. ఎంత పలుచబడుతున్నా సరే తిరిగి గతంలోలా జుట్టు వచ్చేస్తుంది. దీంతో మీ నిండయిన తలకట్టు అందరినీ ఎప్పటిలాగే ఆకర్షిస్తుంది. సింపుల్ గా కింద చెప్పిన విధంగా చేస్తే సరి..
కావాల్సిన పదార్ధాలు:

  • దాల్చిన చెక్క పొడి ఒక పెద్ద స్పూన్
  • రెండు టేబుల్ స్పూన్ల తేనే
  • రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
తయారీ విధానం:
  • పైన చెప్పిన మూడు కలిపి పేస్టు లా చేసుకోండి.
  • ఆ పేస్టును స్నానికి అరగంట ముందు జుట్టు పల్చబడిన తల తలకట్టు భాగానికి అప్లయ్ చేయండి.
  • కాసేపు ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది.
  • ఇలా వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే రాలిన చోట వెంట్రుకలు వచ్చేస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)