ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా ! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు ! ఎలా వెళ్లాలో తెలుసా..?


ఇండోనేషియా స‌మీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్ర‌మే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవ‌న్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవుల‌న్నీ హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోకి వ‌స్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవ‌రించి ఉన్న స‌ముద్రాన్ని మాత్రం జావా స‌ముద్ర‌మ‌ని పిలుస్తారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే… ఈ బాలి దేశంలో మ‌హాస‌ముద్రంలో ఉండే ఓ చిన్న‌పాటి కొండ‌పై ఓ హిందూ దేవాల‌యం ఉంది. ఇది చాలా ఏళ్ల కింద‌టి నాటిద‌ని చెబుతారు. ఈ దేవాలయం ప్ర‌త్యేక‌త ఏమిటంటే…

బాలిలోని త‌బ‌నాన్ అనే ప్రాంతంలో మ‌హాస‌ముద్రంలో కొండ‌పై ఉన్న ఆల‌యాన్ని త‌నాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాల‌యం. ఇక్క‌డ స‌ముద్రం, భూమి రెండూ క‌ల‌సి దైవంగా ఏర్ప‌డ్డాయ‌ని న‌మ్ముతారు. ఈ ఆల‌యం చుట్టూ మ‌హాస‌ముద్రం ఉండ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున అలలు వ‌స్తుంటాయి. ఒక‌సారి అల వ‌స్తే ఆల‌యం మెట్ల‌న్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఆ స‌మ‌యంలోనే ఆ ఆల‌యంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వ‌చ్చిన‌ప్పుడు మెట్ల‌పైనే ఉంటే ఆ అల‌తోపాటే స‌ముద్రంలోకి వెళ్తారు.

ఇక ఈ ఆల‌యం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవుల‌ను ప‌ర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్క‌డికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. కాగా ఈ ఆల‌యం కింది భాగంలో అత్యంత పురాత‌న వ‌స్తువులు ఎంతో విలువైన‌వి ఉన్నాయ‌ట‌. కానీ వాటికి కంటికి క‌నిపించ‌ని విష స‌ర్పాలు కాప‌లాగా ఉంటాయ‌ట‌. ఎవరైనా ఆ వ‌స్తువుల‌ను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయ‌ని ఇక్క‌డి స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆల‌యంలో ఉండే మ‌రో విశేష‌మేమిటంటే.. ఈ ఆల‌యం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆల‌యంగా చెక్కారు. దీంతో ఆల‌య ప‌రిస‌రాలు చాలా ప్ర‌కృతి మ‌నోహ‌రంగా ఉంటాయి. ఇక ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వంటే న‌మ్మండి. అంత‌టి సుంద‌రంగా ఆల‌య ప‌రిస‌రాలు దర్శ‌న‌మిస్తాయి. అయితే ఈ ఆల‌యానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంద‌ట‌. ఎందుకంటే ఇక్క‌డ ప్రాణాపాయ ప‌రిస్థితులు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి, ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆ మాత్రం ఎక్కువ డ‌బ్బును పర్యాట‌కుల నుంచి వ‌సూలు చేస్తారు లెండి..! ఏది ఏమైనా ఈ ఆల‌య విశిష్ట‌త‌లు భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి క‌దూ..!

Popular Posts

Latest Posts