సామాన్య భక్తులకు మాత్రం ఇదీ పరిస్థితి.. దేవుడా ? ఇదెక్కడి పద్ధతి ? ఎవరిని శిక్షిస్తున్నావు ? ఎవరిని ఆశీర్వదిస్తున్నావు ?


తిరుమల శ్రీవారి రక్షకభటులు సాక్షాత్తూ యమకింకరులయ్యారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడికి ఏకంగా వైకుంఠప్రాప్తి కలిగించారు నిజమే సుప్రసిద్ధ, ప్రపంచ ప్రఖ్యాత శ్రీవారి దేవస్థానంలో పనిచేసే రక్షకభటుల తీరు ఇంత అమానవీయంగా ఉంది…! వీవీవీఐపీలు వస్తే ఉన్నతాధికారులు సహా సిబ్బంది వాళ్ల చల్లని దీవెనల కోసం, ఆశీస్సుల కోసం పడిచస్తుంటారు పరితపిస్తారు వాళ్లు అక్కడున్నంతసేపూ సాక్షాత్తూ శ్రీవారు వచ్చి ఎదుట నిలిచినా వాళ్లు పట్టించుకోరు. ఆ వీవీవీఐపీలకు అద్భుత దర్శనాలు, జ్ఞాపికలు, మంగళాక్షతలు, శాలువాలు… ఓహ్… వాళ్లే దేవుళ్లు…! కానీ క్యూ లైన్లలో మెల్లి మెల్లిగా కదులుతూ, శ్రీవారినే మనసు నిండా నింపుకుని, నిజమైన సామాన్య భక్తులకు మాత్రం ఇదుగో ఇదీ శాస్తి…! దేవుడా..? ఇదెక్కడి పద్ధతి…? ఎవరిని శిక్షిస్తున్నావు..? ఎవరిని ఆశీర్వదిస్తున్నావు..? ఐనా టీటీడీ చేతిలో చిక్కుకున్నవాడివి, నిన్నేమని అడిగేది..? నీకేం చెప్పేది..? 
ఈయన పేరు కోటా పద్మనాభం… వయస్సు 56… ఏలూరు కార్పొరేషన్‌లో తాగునీటి సరఫరా ఉద్యోగి… తన మనమరాలు దీక్షిత అన్నప్రాసన కోసం కుటుంబసభ్యులతో తిరుమలకు వచ్చాడు… ఎప్పుడు..? 3 నెలల క్రితం…! అదేరోజు రాత్రి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు… కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆయన పొరపాటున మహిళల క్యూలోకి వచ్చాడు… దీంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది… మహిళా సిబ్బంది… ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు… కుటుంబసభ్యులు ఆయన దురుద్దేశపూర్వకంగా వ్యవహరించలేదని చెబుతున్నా, మొత్తుకుంటున్నా సరే సదరు మహిళా సెక్యూరిటీ (ఎవరికి సెక్యూరిటీ..? ఇప్పుడు ఇదీ పెద్ద ప్రశ్న..) ఆయనపై పిడిగుద్దులు కురిపించారు… అసలే హార్ట్ పేషెంట్… కుప్పకూలిపోయాడు… కోమాలోకి వెళ్లిన ఆయన్ని స్విమ్స్‌లో చేర్చారు… 97 రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచాడు… ప్చ్… టీటీడీ స్టాప్ అరాచకం నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేకపోయాడు… తన ఖర్మ అంతేనంటారా..? అవును… మన ఖర్మ కూడా..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)