వారానికి రెండు సార్లు తలస్నానం చేసే ముందు ఇలాగా చేస్తే జుట్టు రాలడం ఆగడమే కాకుండా జుట్టు నెరవకుండా ఉంటుంది


జుట్టు రాలడం, ఉన్న జుట్టు తెల్లబడడం ఇప్పుడున్న ప్రధానమైన సమస్యలు అయితే ఈ రెండిటిని బ్యాలన్సు చెయ్యడం చాలా కష్టం అంటే జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తే ఈలోపు జుట్టు నెరిసిపోతుంది అయితే దీనికి కొంచం ఓపికగా చేసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది అలాగే అదే చిట్కాకి జుట్టు చిన్న వయసులో నెరవడం కూడా ఆగిపోతుంది. ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము
కావాల్సిన పదార్ధాలు :-
నువ్వుల నూనే - రెండు స్పూన్లు
గోరింటాకు పొడి - 4 స్పూన్లు
మందార ఆకుల పొడి (బయట ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది అది వాడవచ్చు) - రెండు స్పూన్లు.
ఆలివ్ నూనే - రెండు స్పూన్లు.
తయారు చేసుకునే విధానం:-
ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో గోరింటాకు పొడి, మందార ఆకుల పొడి, నువ్వుల నునే మరియు ఆలివ్ నునే వేసి బాగా కలుపుకుని తలకి రాసుకోవాలి. రాసుకున్న ఒక అరగంట తరువాత కడిగివేసుకోవాలి అలాగే తలస్నానం గోరు వెచ్చని నీటితో చేసుకోవాలి ఇలాగా వారానికి రెండు నుండి మూడు సార్లు చేసుకోవాలి. దీనిలో ఉండే మందారం మరియు గోరింటాకు జుట్టు కుదుళ్ళను పటిష్టంగా చేస్తుంది అలాగే నువ్వుల నునే మరియు ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడాన్ని ఆపి తెల్లపడకుండా చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)