శనివారం ఈ పనులు చేస్తే మీకు ఇబ్బందులే

Loading...

మనది నమ్మకాలు, ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సమాజం. సాంకేతికంగా ఎంతో పురోగతితో ముందుకు పోతున్నా ఇంకా ప్రాచీన కాలం నాటి పద్ధతులను మాత్రం వదలడంలేదు. వాటిని ఆచరించడం వల్లనే సుఖ శాంతులు, శుభ సౌఖ్యాలు వస్తాయని బలంగా నమ్ముతారు మన వారు. అటువంటి వ్యవహారాల్లో ఒకటి శనివారం కొన్ని పనులకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు కారణం.. మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో 9 గ్ర‌హాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వీటినే న‌వ‌గ్ర‌హాలు అని వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ క్ర‌మంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్ర‌కారం ఈ 9 గ్ర‌హాలు మ‌నుషుల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతారు. వాటి గ‌మ‌నాన్ని బ‌ట్టి వ్య‌క్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్ర‌హం ఒక్కో ర‌క‌మైన ఫ‌లితాల‌ను ఇస్తుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిప‌తిగా ఉంటుంది (రాహు, కేతువుల‌కు త‌ప్ప‌). ఈ క్ర‌మంలో శ‌నిగ్ర‌హం అధిప‌తిగా ఉన్న రోజు శ‌నివారం. మరి ఆ రోజు ఏం పనులు చేయకూడదని చెబుతున్నారంటే..
శనివారం ఈ పనులు చేస్తే మీకు ఇబ్బందులేనట..

  • వంకాయ‌లు, న‌ల్ల మిరియాల‌ను శ‌నివారం రోజున కొన‌రాదు, వాడరాదట. లేకపోతే శ‌నిగ్ర‌హంతో స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌ట‌. ఆరోగ్యం బాగుండ‌ద‌ట‌. సంప‌ద హ‌రించుకుపోతుంద‌ట‌.
  • సాధార‌ణంగా వ్య‌క్తులెవ‌రూ మ‌రొక‌రి చేతికి ఉప్పు ఇవ్వ‌రు. కానీ శ‌నివారం రోజున ఉప్పును ఎవ‌రికైనా దాన‌మివ్వ‌వ‌చ్చ‌ట తెలుసా. దీంతో స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొన‌కూడ‌దట. కొంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.
  • శ‌నివారం రోజున కొత్త వాహ‌నాల‌ను అస్స‌లు కొన‌కూడ‌దట. ఐరన్ వ‌స్తువుల‌ను అసలుకే కొనరాదట. కొంటే ప్ర‌మాదాల బారిన ప‌డ‌తార‌ని పండితులు పేర్కొంటున్నారు.
  • మినప పప్పు, వంటనూనెను శ‌నివారం పూట కొన‌కూడ‌దట. కానీ దాన్ని ఆ రోజున వండి పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చునట. లేదంటే కాకుల‌కు అయినా పెట్ట‌వ‌చ్చు. దీంతో శ‌ని సంతృప్తి చెందుతాడు. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాడని పండితుల ఉవాచ.
  • నల్ల రంగు దుస్తుల‌ను శ‌నివారం రోజున వేసుకోరాదట. అలా చేస్తే శ‌నికి ఆగ్ర‌హం వ‌స్తుంద‌ట‌. అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌.
  • ఆవాల‌ను శ‌నివారం పూట తిన‌రాదట. అలాగే ఆవ‌నూనెను కూడా. ఈ రెండింటినీ ఆ రోజున కొన‌రాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే ఆవ‌నూనెను శ‌నివారం పూట శ‌ని విగ్ర‌హంపై పోసి అభిషేకం చేయాలట. దీంతో శ‌ని సంతృప్తి చెంది మంచి ఫ‌లితాల‌ను ఇస్తాడ‌ట‌.
  • చెక్కతో చేసిన ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా శ‌నివారం కొనరాదట.
Loading...

Popular Posts