మీరెప్పుడైనా నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడి లేచారా? మీ శరీరం కుదిపేసినట్లు మీకెప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఉలికి పడతారో తెలుసా?

Loading...

మీరెప్పుడైనా నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడి లేచారా? మీ శరీరం కుదిపేసినట్లు మీకెప్పుడైనా అనిపించిందా? ఇలా జరిగిన తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకోవడానికి 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. కొందరికి ఈ ఉలికిపాటు కలలు కనడం వలన కలిగితే, మరికొందరికి మరికొన్ని కారణాల వలన కలుగుతుంది. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… నిద్రలో ఉలికిపాటు పెద్ద సమస్యేం కాదు. ఇలాంటి అలవాటున్న వారు బాధపడాల్సిన అవసరం లేదు.
దీనినే హైప్నిక్ జర్క్ (కుదుపు) అంటారు. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా జరగడానికి వారు చెప్పిన కొన్ని కారణాలు.

  • చాలావరకూ త్వరగా పడుకోవడం వలన ఈ విధంగా జరుగుతుంది:
  • మనం నిద్రపోతున్న సమయంలో మెదడు కొన్ని రసాయనాలను మరియు హార్మోన్లను విడుదల చేయడం వలన శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై ఒక్కసారిగా కదులుతాయట.
  • చాలామంది నిద్రలోకి జారుకున్న తర్వాత కొన్ని భయంకరమైన కలలుకంటూ ఉంటారు. పెద్ద కొండలు, చెట్ల నుండి కిందకు పడిపోతున్నట్లుగా, మరికొన్ని భయానక పరిస్థితులను ఎదుర్కుంటున్నట్లుగా కలలుకన్నప్పుడు ఉలిక్కిపడి వెంటనే నిద్రలేస్తారు.
  • నిద్రలేమి, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వలన కూడా ఇలా జరుగుతుందట.
Loading...

Popular Posts