Loading...

మనం చూసినంతవరకు గుడి పరిసరాలు ఎలా ఉంటాయి, గుడి లోపల ఎలా ఉంటుంది? నిత్యం భక్తులతో రద్దీగా, దర్శనం కోసం లైన్లు కట్టిన జనాలతో, పాటలతో, భజనలతో సందడిసందడిగా ఉంటుంది. కాని హిమచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక హిందు దేవాలయం అలా ఉండదు. ఆ గుడి లోపలికి ఎవ్వరు పోరు. మరీ ఎక్కువ భక్తి పుట్టుకొస్తే గుడి గేటు దాకా కూడా రాకుండా, బయట కొంచెం దూరం నుంచే దండం పెట్టేసి వెళ్ళిపోతారు తప్ప లోనికి ఆడుగు పెట్టె ధైర్యం చేయరు. మరి అక్కడ అంతలా భయపెట్టిస్తున్న విషయం ఏమిటి ? అక్కడ దెయ్యాలు ఉన్నాయా ? గుడిలో దేయ్యలేందుకు ఉంటాయి లెండి. మరి ఏమిటి సంగతి ? అది ఎవరి గుడి? జనాలు ఎందుకు లోనికి వెళ్ళలేకపోతున్నారు?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, చంబ జిల్లాలోని బహ్మార్ గ్రామంలో ఉన్న ఈ గుడిలో ఉన్నది ఏ దేవుడో తెలుసా? మృత్యుదేవత యమరాజు. ఇందులో సాక్షాత్తు కాలయముడు కొలువుదీరాడని నమ్ముతారు అక్కడి జనాలు. గుడిలో కంటికి కనిపించని నాలుగు ద్వారాలు ఉంటాయట. అందులో ఒకటి బంగారు ద్వారం, వెండి ద్వారం, కాంస్య ద్వారం మరొకటి ఇనుప ద్వారం ఉన్నాయట. మనుషులు చేసిన పాపపుణ్యాలను బట్టి, ఎవరు ఏ ద్వారం నుంచి ఏ లోకానికి చేరుకుంటారో యమరాజు నిర్ణయిస్తాడట. ఆ గుడిలో ఓ గది చిత్రగుప్తుడి కోసం కూడా ఉంది. యమధర్మరాజు, చిత్రగుప్తులు తమ నిజ స్వరూపంలో కూడా గుడిలో తిరుగుతారని, మనుషుల పాపపుణ్యాలు ఈ ఇద్దరు ఈ గుడిలోంచి కూడా లెక్కకడతారని ప్రజలు నమ్ముతారు. మనిషి యొక్క ఆత్మ ఈ గుడి నుంచే వేరే లోకాలకు బయలుదేరుతుందని, మృత్యు భయంతోనే ఆ గుడి లోపలి ఎవరు వెళ్ళరని స్థానికులు చెబుతున్నారు.
ఈ గుడి కట్టి 1400 సంవత్సరాలు అవుతున్నాయి అని చరిత్రకారులు చెబుతున్నారు. మనుషుల ఆత్మలు ఇక్కడినుంచే బయలుదేరుతాయి అని ప్రజలు చెబుతున్నారు సరే గాని, ఈ గుడి కట్టకముందు యమధర్మరాజుల వారు భూమ్మీద ఉండాలనుకున్నపుడు ఎక్కడ ఉండేవారో మరి.
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
