ఇల్లు ఈ విధంగా తుడిస్తే (తడి గుడ్డ వేస్తె) ఇంట్లో నల్ల చీమలు, ఈగలు, దోమలు అస్సలు రావు

Loading...

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటె ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉన్న మనుషులకు మంచి ఆరోగ్యం మరియు అధిక శుభ్రత కలుగుతుంది. అయితే ముఖ్యంగా ఇల్లు ఊడ్చిన తరువాత తడి గుడ్డ పెట్టి తుడవడం అనేది చాలా ముఖ్యం అయితే కేవలం నీటిలో తడి గుడ్డ ముంచి ఇల్లు తుడిస్తే సరిపోదు ఈ విధంగా తుడిస్తే ఇంట్లో నల్ల చీమలు, ఈగలు దోమలు రావు అదెలాగో ఇప్పుడు చూద్దాము.
ఇల్లు ఈ విధంగా తుడవాలి:-

  • ఇల్లు తుడిచే నీళ్ళు కొద్దిగా వేడిగా ఉండాలి ఇలాగా ఉండటం వల్ల క్రిమికిటకాలు చచ్చిపోతాయి, అలాగే వేడి నీటిలో కొద్దిగా డెట్టాల్ వేసి తుడిస్తే రోగాలు ఇంటి లోపాలకి రావు.
  • ఇంట్లో నల్ల చీమలు ఉన్న చోట నీళ్ళల్లో కొద్దిగా నల్ల మిరియాలు వేసి తుడిస్తే నల్ల చీమలు చుట్టూ పక్కల రావు.
  • ఇంట్లో ఈగలు దోమలు రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళల్లో కర్పూరం వేసి కలిపి తుడిస్తే ఆ ఘాటుకి దోమలు ఈగలు రావు.
  • ఇంట్లో బొద్దింకలు ఈగలు ఎక్కువగా ఉంటె డిటర్జెంట్ పొడి వేసి తుడవాలి ఇలాగా చేస్తే బొద్దింక గుడ్డ్లు మరియు ఈగ గుడ్లు పూర్తిగా పోతాయి.
  • ఇంట్లో ఏమి లేకపోయినా సరే చిటికెడు సర్ఫ్ పొడి వేసి బాగా నురగ తెప్పించి తుడిస్తే ఆ ఇల్లు శుభ్రంగా సువాసనలు వెదజల్లుతాయి
Loading...

Popular Posts