భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు కనుక పాటిస్తే ఆ ఇంట్లో ధనానికి తిండికి లోటు ఉండదు


ఇంట్లో భోజనం చెయ్యడం అంటే అది ఎంతో సంతోషం, ఇంట్లో అందరు కలిసి కుర్చుని భోజనం చేస్తే అది స్వర్గంతో సమానం అయితే భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు కనుక పాటిస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు అలాగే ఇంట్లో ఎప్పుడు తిండికి లోటు ఉండదు. అయితే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాము.
ఒక వేళ 
మీరు డైనింగ్ టేబుల్ వాడితే
డైనింగ్ టేబుల్ పైన అద్దం ఉండేలా చూసుకోవాలి దీనివల్ల తినే అన్నం రెట్టింపు అవుతుంది అని ధన, ధాన్యాలు ఆ ఇంట్లో సమృద్ధిగా ఉంటాయని నమ్మకం. అలాగే ఎప్పుడైనా సరే గుండ్రంగా ఉన్న డైనింగ్ టేబుల్ అస్సలు తీసుకోరాదు.స్క్వేర్ లేదా గుడ్డు ఆకారంలో ఉన్న టేబుల్ వాడవచ్చు.
ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ వాడకపోతే
కొంత మంది కింద కుర్చుని భోజనం చెయ్యడానికి ఇష్టపడతారు అందుకే డైనింగ్ టేబుల్ ఇంట్లో ఉండవలసిన అవసరం అస్సలు ఉండదు అలాంటివాళ్ళు ఎట్టి పరిస్తితుల్లోను భోజనం దగ్గర కూర్చునే చోట చీపురు లేదా ఇల్లు తుడిచే సామాన్లు ఉంచరాదు. దీనివల్ల ఆ ఇంట్లో ధనం లేదా అన్నం ఊడ్చుకుపోతుంది అని నమ్మకం.
టేబుల్ ఉన్న లేకపోయినా గుర్తుపెట్టుకోవలిసిన విషయాలు
ఎప్పుడైనా సరే అన్నం తినే చోట నీళ్ళు ప్రవహించే చోటు ఉండకూడదు. దీని వల్ల ధన నష్టం మరియు ఇంట్లో ఆరోగ్య భంగం.  ఎప్పుడైనా సరే దక్షిణం వైపు చూస్తూ తినకూడదు దీని వల్ల ఇంటి యజమానికి మంచి జరగదు.
భోజనం చేసాక ఆ చోటుని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి దీనివల్ల అక్కడ దారిద్య్ర లక్ష్మి ఉండదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)