మీరు పుట్టిన నెలను బట్టి మీకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయో తెలుసా ? ఖచ్చితంగా తెలుసుకోండి

Loading...

సాధారణంగా వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు పుట్టుకతో సంక్రమిస్తాయని ఇప్పటి వరకు వైద్య శాస్త్రం కనుగొన్న సత్యం. పుట్టిన నెలను బట్టి కూడా వ్యాధులు వస్తాయని ఇప్పుడిప్పుడే పరిశోధకులు కనుగొంటున్నారు. తాజాగా స్పెయిన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలికంట్ పరిశోధకులు 30వేల మందిపై పరిశోధించి మరీ ఈ సరికొత్త వింతను కనుగొన్నారు. అయితే రెండేళ్ల క్రితం కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోదనల్లో కూడా పుట్టిన నెలను బట్టి కొన్ని కామన్ వ్యాధులు సంక్రమిస్తాయని వెల్లడిచేశారు. పుట్టిన నెల ఆధారంగా సుమారు 1700కు పైగా అనారోగ్య సమస్యలు పసి పిల్లలగా ఉన్నప్పటి నుంచే వచ్చే ప్రమాదం ఉందని వారు కనుగొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్య సమస్యల నిర్థారణ సమయంలో ఈ పరిశోధనల్లోని విషయాలు వైద్యులకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని వారు చెప్పారు. పుట్టిన నెలను బట్టి ఈ వ్యాధులు మాత్రమే వస్తాయని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని కూడా వెల్లడించారు. కాని ఈ వ్యాధి లక్షణాలు వారి శరీరంలో ఉంటాయని మాత్రం పేర్కొంటున్నారు. తాజా పరిశోధకులు మాత్రం పుట్టిన నెల ఆధారంగా 27 రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.

శీతాకాలంలో ఆల్ట్రా వయిలెట్ రేస్, విటమిన్ డీ స్థాయిల్లో భేదాలు, వైరస్ లు పిండం ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. అలాగే సెప్టెంబర్ నెలలో పురుషుల్లో థైరాయిడ్ ప్రాబ్లెమ్స్ ఎక్కువగా వస్తాయంటున్నారు. ఇక జూలైలో పుట్టిన స్త్రీలలో 27 శాతం మందికి హై బీపీ ఉండే అవకాశముందని.. 40శాతం మంది నిగ్రహం కోల్పోయే గుణాన్ని కలిగిఉంటారంటున్నారు.
ఏ నెలలో జన్మిస్తే ఏ దీర్ఘకాలిక వ్యాధి వస్తుందంటే..

జనవరి:
పురుషులు: మలబద్ధకం, అల్సర్, వెన్నునొప్పి
స్త్రీలు: మైగ్రేయిన్, రుతుక్రమ సమస్యలు, హార్ట్ ఎటాక్
ఫిబ్రవరి:
పురుషులు: థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్లనొప్పి
స్త్రీలు: కీళ్లనొప్పి, థైరాయిడ్ సమస్యలు, రక్తం గడ్డకట్టుట
మార్చి: 
పురుషులు: శుక్ల సమస్యలు, గుండె జబ్బులు, ఆస్త్మా
స్త్రీలు: కీళ్లవాతం, వాతరోగం, మలబద్ధకం
ఏప్రిల్:
పురుషులు: ఆస్తమా, ఎముకల వ్యాధులు, థైరాయిడ్ ప్రాబ్లెమ్స్
స్త్రీలు: ఎముకల వ్యాధి, ట్యూమర్, శ్వాసనాళాల వాపు
మే: 
పురుషులు: ఒత్తిడి, ఆస్తమా, షుగర్
స్త్రీలు: ఎముకల వ్యాధులు, మలబద్ధకం
జూన్:
పురుషులు: గుండె జబ్బులు, కంటి వ్యాధులు, దీర్ఘకాళికల శ్వాసనాళాల వాపు
స్త్రీలు: నిగ్రహం కోల్పోవడం, కీళ్లవాతం, వాతరోగం
జూలై:
పురుషులు: కీళ్లవాతం, ఆస్తమా, ట్యూమర్స్
స్త్రీలు: మెడనొప్పి, ఆస్తమా, ట్యూమర్స్
ఆగస్ట్:
పురుషులు: ఆస్తమా, ఎముకల వ్యాధి, థైరాయిడ్ సమస్యలు
స్త్రీలు: రక్తం గడ్డకట్టుట, కీళ్లవాతం, వాతరోగం
సెప్టెంబర్:
పురుషులు: ఆస్తమా, కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు
స్త్రీలు: కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు, హానికరమైన ట్యూమర్లు
అక్టోబర్:
పురుషులు: థైరాయిడ్ సమస్యలు, కీళ్లవాతం, మైగ్రేయిన్
స్త్రీలు: అధిక కొవ్వు, కీళ్లవాతం, పాండురోగం
నవంబర్:
పురుషులు: దీర్ఘకాళిక చర్మవ్యాధులు, గుండె సమస్యలు, థైరాయిడ్ సమస్యలు
స్త్రీలు: మలబద్ధకం, హార్ట్ ఎటాక్, నరాల సమస్యలు
డిసెంబర్:
పురుషులు: శుక్లసంబంధిత వ్యాధులు, ఒత్తిడి, గుండె సమస్యలు
స్త్రీలు: శ్వాసనాళాల వాపు, ఆస్తమా, రక్తం గడ్డకట్టుట
Loading...

Popular Posts