దేవుడికి ఇది కనుక సమర్పిస్తే డబ్బు మరియు ఆర్ధిక ఇబ్బందులు తొలగడమే కాకుండా అనుకున్న పని అనుకున్నట్టుగానే జరుగుతుంది

Loading...

ప్రతిరోజూ దైవానికి పూజ చేస్తుంటాం. దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తుంటాం. పూలు, పండ్లతో పూజలు చేస్తుంటాం. ఐతే దేవతలకు ఒక్కో పండు ఒక్కోవిధమైన తృప్తిని కలిగిస్తుందనీ, ఒక్కో పండుకు ఒక్కో రకమైన కోరికలు సిద్ధిస్తాయనే విశ్వాసాలున్నాయి. అవెంటో చూద్దాం.
  • అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.అలాగే అప్పులు మరియు డబ్బుకి సంభందించిన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి 
  • చిన్న అరటి నైవేద్యంగా ఉంచితే నిలచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.
  • అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా – అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది. పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది.
  • పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే – పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. 
  • సపోటా పండును నైవేద్యంగా పెడితే – అమ్మాయిని చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు తొలగిపోతాయి.
  • కమలాపండును నైవేద్యంగా పెడితే – పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే, కమలాపండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతాయి
Loading...

Popular Posts