ఎసిడిటీని నిమిషాల్లో తగ్గించే సింపుల్ చిట్కా

తిన్న అన్నం అరగాలంటే యాసిడ్‌ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్‌ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా… లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్‌ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్‌ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే… కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్‌ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్‌ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. దానినే ఎసిడిటీ అని చెప్పుకుంటాం. ఎసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. 
ఎసిడిటీకి ప్రధాన కారణాలు ఇవే…
* సరిగా నిద్ర లేకపోవడం, సరిగ్గా నమలకుండా వెంట వెంటనే తినడం. సరియైన సమయానికి తినకపోవడం.
* మసాలాలు, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం.
* ధూమపానం, మద్యపానం.
* అధిక బరువు ఉన్న వారికి కూడా పొట్ట, గుండెల్లో మంట ప్రారంభమవుతుంది.
ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు :
* రోజూ అరటి పండు తింటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసును తేనెతో కలిపి అన్నం తిన్న తర్వాత తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
* ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించుకోవాలి. పచ్చళ్లు, ఆహారంలో మసాలా దినుసులు తగ్గించుకోవాలి.
* పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు… ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి అలవాటుగా తీసుకోవాలి.
* మీరు తీసుకునే ఆహారంలో భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకూడదు. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి.
* ఇవన్నీ ఎసిడిటీని దీర్ఘకాలంలో తగ్గించడానికి పనిచేస్తాయి. కాని తులసి ఆకులు మాత్రం ఎసిడిటీని తక్షణం తగ్గించేందుకు దోహదపడుతుంది.
6 తులసి ఆకులను  ఒక గ్లాస్ నీళ్లలో బాగా మరిగించి చల్లారిన తరవాత ఆ కాషాయం లో కొంచెం మజ్జిగ చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఎసిడిటీ వెంటనే తగ్గిపోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)