ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు.. తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి

Loading...
ఇతరుల నుండి అప్పు తీసుకున్నప్పుడు లేదంటే ఇంకేదైన ఆర్ధిక సహాయం పొందినప్పుడు దానికి రుజువుగా అప్పు తీసుకున్న వారు ప్రామిస‌రీ నోటు రాసి ఇస్తారు. అయితే ఆ ప్రామిసరీ నోటును రాసేటప్పుడు కొన్ని నియమ నిభందనలు పాటించాలి. వాటి గురించి చాలా మందికి తెలియక నోటు రాయించుకునేప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా జరిగిన సందర్భాల్లో ఆ డబ్బులు సక్రమంగా తిరిగి వస్తే సరేగాని లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆ ప్రాంసరీ నోట్ లో కొన్ని న్యాయపరమైన మిస్టేక్స్ చేస్తే కోర్టులో చెల్లకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రాంసరీ నోటు రాయించుకునేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో న్యాయ నిపుణుల సలహాలను కింద ఇస్తున్నాం తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి..
ప్రామిస‌రీ నోటు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు:
1. ప్రామిస‌రీ నోటు లిఖితపూర్వ‌కంగా ఉండాలి.
2. అప్పు ఇచ్చిన, తీసుకునే వారి పేర్లు ప్రభుత్వం జారి చేసినా ఎదైనా గుర్తింపు కార్డులో పేర్కొన్న విధంగా మాత్రమే ఉండాలి.
3. ప్రామిస‌రీ నోటు ఏ కారణంతో రాసి ఇస్తున్నారో స్ప‌ష్టంగా ఉండాలి.
4. ప్రామిస‌రీ నోటు రాసిన స్థ‌లం, తేదీల‌ను ఖచ్చితంగా పేర్కొనాలి.
5. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్ష‌రాల్లోనూ రాయాలి.
6. రెవెన్యూ స్టాంప్ అంటించి సాక్షుల సమక్షంలో రుణ గ్రహీత సంత‌కం చేయాలి. సాక్షుల సంతకాలు కూడా ప్రామిస‌రీ నోటు పై తప్పనిసరిగా చేయించాలి.
7. అప్పు తిరిగి ఎప్పుడు, ఏ విధంగా చెల్లిస్తారో? ఆ వివరాలు పొందుపరచాలి.
8. అప్పు డబ్బు ఏ విధంగా స్వీకరించారో అనగా న‌గ‌దు ద్వారా ముట్టిన‌దో, చెక్కుద్వారా ముట్టిన‌దో రాయాలి.
9. ఇచ్చిన అప్పుకి వడ్డీ, ఇతర షరతులు స్ప‌ష్టంగా పేర్కొనాలి.
10. అప్పు తీసుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయితే గనుక వేరే వారితో కాకుండా అతనితోనే నోటు రాయించుకోవాలి. ఎందుకంటే కోర్టు వరకూ వెళితే సంతకం నాది కాదని చాలా మంది బుకాయిస్తారు. కాని నోటు మొత్తం వారే రాసి ఉంటే రాత నాది కాదని అనడానికి ఛాన్సు లేదు.
11.ఆ నోటుపై వ్యక్తిగత అవసరాలకు అప్పు తీసుకుంటున్నట్టుగా రుణ గ్రహీత పేర్కొంటే వారి కుటుంబ సభ్యుల బాధ్యత ఉండదు.
12. చాలా మంది ఖాళీ నోట్లు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా సరికాదు. ఎంత అప్పు ఇచ్చారో స్పష్టంగా నోటుపై రాయిస్తేనే మంచిది.
Loading...

Popular Posts