హృదవిదారక సంఘటన : పశువులకు వేసే గడ్డితో రొట్టెలను చేసుకొని తింటున్న రైతులు..


భారత దేశం పేదలకు సంపన్న దేశం అని ఆర్ధిక శాస్త్రం లో చదువుకున్న సంగతి విధితమే.. ఓ వైపు ఇండియా డిజిటల్ ఇండియా.. అంటూ వెలుగులు విరజిమ్ముతుంది.. ఇది నాణెం కు ఒకవైపు... మరో వైపు దారిద్రపు చీకట్లు కమ్ముకొని ఉన్నాయి.. ఇది నాణెం కు మరో వైపు.. కొంత మంది రెస్టారెంట్ల లో భోజనం చెత్త కుప్ప పాలు చేస్తుంటే.. మరో వైపు ప్రజలు తినడానికి తిండిలేక పశువులకు మేతగా వేసే గడ్డితో రొట్టెలు చేసి కడుపునింపుకొంటున్న హృదవిదారక సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని టికంపూర్ డివిజన్ లో ఎన్నో కుటుంబాలు.. తినడానికి తిండి లేక.. పశువులకు వేసే గడ్డితో రొట్టెలను చేసుకొని ఆకలిని తీర్చుకొన్నాయి. అది కూడా రోజుకి ఒక పూట రొట్టెలను చేసుకొని తింటే చాలు అనేటంత దీనస్థితి ఉన్నది ఆ గ్రామంలో.. ఇక వారికి పాలకూరను నీటిలో ఉడికించుకొని తింటే ఆ రోజు వారు పరమాన్నం తిన్నట్లు సంతోష పడ్డారట.. భరతమాత ఒడిలో పేదబిడ్డల అత్యంత దీన గాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మీరు మేకింగ్ ఇండియా అంటూ.. రైతులను దీనస్థితిని పట్టించుకోక పోతే.. రేపు మిగిలిన దేశ ప్రజల పరిస్తితి కూడా ఇంతే అంటూ.. సోషల్ మీడియాలో అప్పటి సంఘటనలు గుర్తు చేసుకొంటున్నారు. అంతేకాదు అయ్యా మోడీగారు.. మాకు స్మార్ట్ సెల్ ఫోన్లు వద్దు.. కనీస అవసరాలైన తిండి బట్ట.. వసతి ఉండేలా చర్చలు తీసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు. రైతుల బ్రతుకులు మార్చేందుకు దారేదీ..? అని అంటున్నాయి..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)