ఈ ఒక్క పని చేస్తే మీకు షిర్డీలో ఏడాది మొత్తం వీఐపి దర్శనం ఫ్రీ

Loading...

ఏడాదిపాటు మీరు ఎన్నిసార్లు వెళ్లినాసరే, షిరిడీలోని ప్రఖ్యాత సాయినాథుడి ఆలయంలో వీఐపీ దర్శనం కావాలా..? భక్తనివాస్‌లో వసతి పొందటానికి మీకు వీఐపీ ప్రాధాన్యం కావాలా..? క్యూలలో గంటల తరబడీ నిలబడాల్సిన అవసరమే లేకుండా, నేరుగా సాయిజపం చేసుకుంటూ, ఆయన దగ్గరకు వెళ్లిపోవాలా..?…… చదువుతుంటేనే సాయిభక్తులకు, తరచూ షిరిడీ వెళ్లే భక్తులకు ఆనందదాయకంగా ఉంది కదూ… సంతోషదాయకమైన దర్శనం అంత సులభంగా పొందితే అంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తున్నది కదూ… అదేసమయంలో దీనికి ప్రత్యేక రేటు ఏమైనా పెట్టారేమో అని సందేహం కూడా వస్తున్నది కదూ… నో, అలాంటి వీఐపీ దర్శన్ టికెట్లు ఏమీ లేవు… ఒకవైపు సమాజసేవ, మరోవైపు దేవుడి సేవ ఒకేసారి సిద్ధించే ఓ సులువైన మార్గాన్ని గుడి ట్రస్టు కల్పిస్తున్నది… అన్నిరకాలుగా ఇది మంచి ఆలోచన…

శ్రీసాయినాథ బ్లడ్ బ్యాంకు అని ఆలయ ట్రస్టు నడిపే ఓ రక్తనిధి ఉంది… అందులో ఒకసారి రక్తదానం చేస్తే చాలు, గుడి ట్రస్టు మీకు వీఐపీ హోదా ఇస్తుంది… అది ఏడాదిపాటు చెలామణీలో ఉంటుంది… ఇది రక్తదానాన్ని ప్రోత్సహించినట్టూ ఉంటుంది ప్లస్ అలాంటి భక్తులకు దైవదర్శనం సులభతరం చేయడం ద్వారా గౌరవంతో సత్కరించినట్టూ ఉంటుంది… అంతే… ఇక ఏ రేట్లూ లేవు, ఏ తిరకాసులూ లేవు… ‘‘గుడిని రక్తదానానికి ఒక హబ్ చేయాలని సంకల్పం… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం… తిరుమలలో దేవుడికి కేశాలు సమర్పించినట్టుగానే ఇక్కడ రక్తం ఇవ్వండి… ఇది సమాజానికీ మేలు, గుడికీ మంచి పేరు’’ అంటున్నాడు ట్రస్టు ఛైర్మన్ సురేష్ హరే… బాగుంది… ఇదీ అసలైన వీఐపీ దర్శనం అంటే… టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారూ… వింటున్నారా..? మీకు ఎంతసేపూ ధనిక భక్తులు, పలుకుబడి ఉన్న భక్తులు, సెలబ్రిటీలు, వీవీవీఐపీ భక్తులు తప్ప కనీసం కాలిబాటన, మెట్లబాటన వచ్చే భక్తులు కూడా వీఐపీ భక్తులుగా కనిపించడం లేదు… ఏం చేద్దామంటారు సార్…?
Loading...

Popular Posts