హోటల్‌లో సర్వీస్ ఛార్జ్‌పై ఫైట్ చేసిన పౌరుడు.. చాలా మందికి సర్వీస్ ఛార్జ్ గురించి తెలియని విషయం


మొత్తం బిల్లులో 10 శాతాన్ని హోటళ్లు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తాయి. సుమారు రూ. 5వేలు బిల్లు అయితే సర్వీస్ ఛార్జ్‌తో కలిపి రూ. 5500 వసూలు చేస్తారు. ఒకేవేళ ఆ హోటల్లో సర్వీస్ నచ్చకపోతే కట్టనవసరంలేదు. విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఓ హోటల్‌పై చేసిన పోరాటం వల్ల సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదనే విషయం తేలిపోయింది.

హైదరాబాద్ శిల్పకళావేదిక వద్ద ఉన్న ఓ హోటల్‌కు వెళ్లిన విజయ్ గోపాల్‌కు రూ. 213 సర్వీస్ ఛార్జ్ వేశారు. ఆ హోటల్‌లో సర్వీస్ నచ్చని ఆయన సర్వీస్ ఛార్జ్ కట్టేది లేదని అన్నారు. కానీ సిబ్బంది చట్ట ప్రకారం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని అనడంతో మొత్తం బిల్లు కట్టి ఆయన బయటకు వచ్చారు. అంతటితో మర్చిపోకుండా ఈ సర్వీస్ ఛార్జ్ సంగతేమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద హోటళ్లలో సర్వీస్ ఛార్జ్ విధి విధానాలను తెలుసుకున్నారు. ఆ సమాచారం ప్రకారం...హోటళ్లలో సర్వీస్ నచ్చినప్పుడు వినియోగదారుడు ఇచ్చేదే సర్వీస్ ఛార్జ్ అని, నచ్చకపోతే సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిన పనిలేదని ఉంది. దీంతో ఆయన వినియోగదారుల ఫారమ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కన్జూమర్ ఫోరమ్ విజయ్ గోపాల్ వాదనను బలపరిచింది. ఆయన వద్ద నుంచి వసూలు చేసిన సర్వీస్ ఛార్జ్ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందిగా హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. పరిహారం కింద మరో రూ.5వేలు చెల్లించాలని చెప్పింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)