ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్, సబ్సిడీతో సొంత ఇంటి కల సాకారం చేసుకోండి ఇలా..

మోఢీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక బ్యాంకులకు చేరిన 15 లక్షల కోట్లలో అధిక భాగాన్ని ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అప్పుగా ఇవ్వనుంది. ఈ దెబ్బతో దేశంలో 4-5 కోట్ల మంది సామాన్యులను సొంత ఇంటి వారిని చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కూడా అమల్లో ఉంది. దాని ద్వారా 2 లక్షల వరకు వడ్డీపై గరిష్ఠ సబ్సిడీ సైతం వస్తుంది. ఇప్పుడు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నా/కొనుక్కున్నా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇంతకూ బ్యాంక్ లోన్, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలంటే..
  • సాధారణంగా ఇంటి నిర్మాణానికి పది లక్షలు అవుతాయనుకుంటే కనీసం చేతిలో నాలుగు లక్షలైనా ఉండాలి. మిగిలిన ఆరు లక్షల రూపాయలకు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమల్లో ఉన్న 9 శాతం వడ్డీరేటు (నెల తర్వాత ఈ రేటు తగ్గుతుంది) ప్రకారం ఈఎంఐ 6,085 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీపై గరిష్ఠంగా 2 లక్షల 20 వేలు సబ్సిడీ ఇస్తుంది. 
  • ఉదాహరణకు.. మీరు రూ.6 లక్షల రుణం తీసుకొంటే… సబ్సిడీ మొత్తాన్ని మినహాయించగా మిగిలిన 3 లక్షల 80 వేలకు బ్యాంకు నిబంధనల ప్రకారం నెలవారి వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈఎంఐ దాదాపుగా 2వేల రూపాయల వరకు తగ్గుతుంది. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద రుణం పొందవచ్చు. 
  • చేతిలో నాలుగు లక్షలు లేవు. కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి. కాని, నిర్మాణానికి పది లక్షలు కావాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి. 
  • అవసరమైతే బ్యాంకులు 8 లక్షల రుణం ఇస్తాయి. కేంద్రం ఇచ్చే వడ్డీ సబ్సిడీ మాత్రం రూ.6 లక్షల వరకు వర్తిస్తుంది. మిగిలిన 2 లక్షలకు సాధారణ గృహరుణ వడ్డీని లెక్కకడతారు. 
  • మీరు 10 లక్షలు రుణం తీసుకుంటే 6 లక్షలకు వడ్డీ సబ్సిడీ.. మిగిలిన రూ.4 లక్షలకు సాధారణ గృహరుణ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఈఎంఐ 10వేల రూపాయలకు బదులు.. సబ్సిడీ రాయితీ పోను 8వేల పైచిలుకు చెల్లిస్తే చాలు. సో, దగ్గర్లోని బ్యాంక్‌కు వెళ్లి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)