షాంపుతో ఈ పదార్థాలను కలిపి వాడితే జుట్టు సమస్యలన్నీ తగ్గుతాయి

  • రోజ్ వాటర్ రోజ్ వాటర్ జుట్టుకు కవాల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టు అందంగా మార్చుతుంది. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ను రెగ్యులర్ షాంపుతో మిక్స్ చేసి తలకు పట్టించి స్నానం చేస్తే అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందుతారు .
  • గ్లిజరిన్ గ్లిజరిన్ లో ఉండే తేమగుణాలు వల్ల ఇది మరో అద్భుతమైన సహజమైన పదార్థంగా పనిచేస్తుంది. దీన్ని షాంపులో మిక్స్ చేసి. తలకు అప్లై చేయడం వల్ల చిక్కుతొలగిపోతుంది. జుట్టు ఎప్పుడూ తేమగా కనిపిస్తుంది. అయితే 7-8 చుక్కల గ్లిజరిన్ మాత్రమే అందులో చేర్చాలి.
  • నిమ్మరసం నిమ్మరసంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చుండ్రు సమస్యలను నివారిస్తుంది. తలలో దురదను తగ్గిస్తుంది. అందుకు కేవలం రెండు స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
  • నూనెలు తలకు పెట్టుకునే నూనెల్లో యాంటీఆక్సిడెంట్స్ అంధికంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను మెరుగుపరుస్తాయి. జుట్టుకు మేలు చేసే నూనెలు చాలానే ఉన్నాయి. వాటిలో ల్యావెండర్ ఆయిల్, కిప్రెస్ నూనెలు, బాదం ఆయిల్, వాటిని ఎంపిక చేసుకుని, రెగ్యులర్ షాంపుకు కేవలం రెండు మూడు చుక్కల కలిపితే చాలు మంచి ఫలితం ఉంటుంది.
  • ఆమ్లా వాటర్ ఆమ్లా వాటర్ ఒక ట్రెడిషనల్ రెమెడీ. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పల్చబడటాన్ని నివారిస్తుంది. జుట్టు తెగకుండా చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, షాంపులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా వాటర్ కలపాలి. ఇది జుట్టును పొడవుగా, బలంగా మార్చుతుంది.
  • తేనె తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. జుట్టు డ్రైగా మారకుండా నివారిస్తుంది. రోజూ వాడే షాంపుకు ఒక స్పూన్ తేనె చేర్చి తలస్నానం చేసుకోవడం వల్ల జుట్టు అందంగా, తేమగా మారుతుంది.
  • అలోవెర జెల్ అలోవెర జెల్ ను తరచూ జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. జుట్టును ఆరోగ్యంగా, అందంగా, చుండ్రులేకుండా మార్చే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. కేవలం అలోవెర నుండి జెల్ ను తీసి, షాంపుతో జోడించి ఉపయోగించుకోవాలి.
  • ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ జుట్టు డ్యామేజ్ అవ్వకుండా చేయడానికి సూచిస్తుంటారు. ఇందులో జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ ను నేరుగా జుట్టుకు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, షాంపుతో కలిపి వాడుకోవచ్చు. ఇది జుట్టును అందంగా ఉంచుతుంది. జుట్టును డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.
  • యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టు చిక్కుపడకుండా చేస్తుంది. జుట్టుకు మంచి కాంతిని, మృదుత్వాన్ని అందిస్తాయి. అందమైన ఆరోగ్యమైన జుట్టును పొందడానికి బ్యూటిఫుల్ న్యాచురల్ పదార్థం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)