సైన్యానికి రూ.కోటి విరాళం.. తన కష్టార్జితం అంతటినీ సైనికులకు దానమిచ్చిన ఈ పెద్దాయనకు సెల్యూట్.. ఈ విషయం SHARE చేసుకుని, ఆయన మంచి పనిని అందరికీ తెలియజెబుదాం!

మన ప్రాణాలను రక్షించేందుకు... తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న సైనికులకు మనం ఏమిస్తున్నాం? వారి కుటుంబాల కోసం కనీసం ఆలోచించామా? జవాన్లు అమరులైన రోజు సంతాపం ప్రకటించడంతోనే మన పనైపోయిందని అనుకుంటే పొరపాటే. మనకు ధైర్యం ప్రసాదిస్తున్న సైనిక కుటుంబాలకు... ధైర్యం చెప్పే పెద్ద మనస్సు కూడా మనకు ఉండాలి. ఇందుకు ఈ పెద్దాయనే ఆదర్శం.

గుజరాత్‌కు చెందిన జనార్దన్ భట్(84) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో క్లర్క్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే, ఇటీవల పాకిస్థాన్ ప్రోద్బలంతో పెట్రేగుతోన్న తీవ్రవాదుల దాడుల్లో మన జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఆయన్ను బాధించింది. ఇందుకు తాను ఏదైనా సాయం చేయాలని నిర్ణయించారు. తన జీవితంలో కష్టపడి కూడబెట్టిన కోటి రూపాయలను నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా సమర్పించారు.

బ్యాంకులో పొదుపుచేసిన ఆ మొత్తంతో వస్తున్న వడ్డీ ఆయన ఆర్థిక అవసరాలు తీర్చుతోంది. అయితే, జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు ముందు అది పెద్ద కష్టం కాదని భావించిన జనార్దన్ తన భార్యతో కలిసి ఆ మొత్తాన్ని సైన్యానికి చెక్ రూపంలో అందించారు.

జనార్దన్ భట్‌‌ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా చాలా మందిని ఆదుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నప్పుడు తోటి సిబ్బందికి సాయం చేశారు. ఓ వ్యక్తికి సాయం చేసేందుకు ఆయన తన తోటి ఉద్యోగుల సహకారంతో రూ.54 లక్షలు విరాళంగా ఇచ్చిన సందర్భం కూడా ఉంది.

దేశంలో బడా వ్యాపారాలు చేస్తూ.. నిత్యం తమ జేబులను నింపుకోవడంలో బిజీగా ఉండే పారిశ్రామిక, రాజకీయ, వాణిజ్యవేత్తలతో పోల్చితే... తన కష్టార్జితం అంతటినీ విరాళంగా సమర్పించిన జానార్ధన్‌ ఎంత గొప్ప హృదయం కలవారో అర్థమవుతుంది. ఆ పెద్ద మనసుకు మనసారా సెల్యూట్ చేద్దామా!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)