గుడికి తాళం వేసి కాపలా... అయినా తన మహిమ చూపిన శివుడు

నల్గొండ జిల్లా కోదాడ నుంచి 23 కీ.మీ. దూరంలోని మేళ్ళచెరువులో ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని పాలకులు పట్టించుకోకపోవటంతో ఈ ఆలయం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఈ లింగం పైన కుడివైపు వెనక పక్క చిన్న గుంత ఉంటుంది. దానిలో నీరు ఎప్పడూ వుంటుంది. కాని ఈ నీరు ఉబికి బయటకు రాదు. అక్కడ నుంచి ఎంత నీరు తీస్తే అంత నీరు మళ్ళీ చేరుతుంది. దానినే మనకు తీర్ధంగా ఇస్తారు. దీని లోనికి దారానికి రాయి కట్టి వేసినా అంతు కనుక్కోలేకపోయారు. ఈ లింగం పెరుగుతూ కూడా ఉంది. దానికి రుజువు లింగం మీద బొట్ల సంఖ్య పెరగటమే అంటారు.
స్థల పురాణం ప్రకారం.... ఇక్కడ శివలింగం తెల్లరాతి లింగం. ఈ లింగానికి వెనకాల జడ ఉన్నది. ఈయన అర్ధనారీశ్వర రూపం అందుకే అలా ఉంది. అందరికీ అద్దంలో చూపిస్తారు గుంతలో ఉన్న గంగనీ, జడనీ. ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పడు దేవాదాయ శాఖ అక్కడ పైప్ లైన్ ఉన్న విషయాన్ని మరిచిపోయి... గుడి కట్టేటప్పడు చూసుకోకుండా కట్టారు. అందుకే ఆ నీళ్ళు అలా వస్తున్నాయని ఆ నీళ్ళన్నింటినీ తోడేయించి, గుడికి తాళం వేయించి వాళ్ళ మనుషులను కాపలా పెట్టారని చెబుతారు స్థానికులు. అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట.

చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూ ఉండేవి. హనుమకొండ వెయ్యి స్ధంబాల గుడిలోని శివుడు ఆక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టటం, గో హింసలు చేయడంతో అక్కడనుండి వచ్చి ఆవులమంద మధ్యలో వెలిశాడని చెబుతుంది అక్కడి స్థల పురాణం. ఒక ఆవు శివలింగంమీద పాలు కురిపించటం చూసి 11 సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేశారు. ప్రతిసారీ లింగం అలా ఏర్పడేదట.. ఆ తర్వాత కాలంలో పూజలు జరపటం మెుదలు పెట్టారు.తర్వాత కాలంలో అమ్మవారు ఇష్టకామేశ్వరిని ప్రతిష్టించారు. ఇక్కడ శివరాత్రితో పాటు అనేక పర్వదినాలలో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)