ఇకపై వంటగ్యాస్ ప్రమాదాలు ఉండవు.. ఎలాగో తెలుసుకోండి !!

టెక్నాలజీ ఇంతగా పెరిగినా గ్యాస్ సిలిండ‌ర్లు పేలి చాలామంది చనిపోతున్నారు. ఎన్నో వస్తువులు సేఫ్టీ పికాషన్స్ తో మోడిపై అవుతున్నాయి. కాని మన తాతల కాలం నుంచి సిలిండర్ మాత్రం అంతే ఉంటుంది. అసలు సిలిండర్లు ఎందుకు పేలుతున్నాయి, వాటిని ఆపేందుకు ఎటువంటి టెక్నికల్ ఛేంజెస్ చేయాలి? ఇటువంటి ధ్యాసే లేదు సిలిండ‌ర్ పేల‌డానికి ఎన్నో కారణాలున్నాయి. ఇన్ని రోజులకు గాని ఓ సంస్థ దీనిపై దృష్టి పెట్టింది. పేలుడు కారణాలన్నిటికీ చెక్ పెడుతూ బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేసే ఇండో గ్యాస్ సంస్థ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను డెవ‌ల‌ప్ చేసింది. పేలుడు స్వ‌భావం లేని ప్లాస్టిక్‌తో ఈ సిలిండ‌ర్ల‌ను త‌యారు చేయ‌డం విశేషం. ఇప్పుడు మనం వాడుతున్న సిలిండ‌ర్ల‌లో గ్యాస్ ప్రెజ‌ర్ ఎక్కువైన‌ప్పుడు దానిని క‌వ‌ర్ చేసే లేయ‌ర్ అడ్డుకోవ‌డంతో పేలుడు సంభ‌విస్తుంది. ప్లాస్టిక్‌ సిలిండర్ల తయారీలో వాడిన పదార్థాలు, చేసిన విధానం వల్ల దాని లోపల ఎక్కువ వేడి లేదా పీడనం ఏర్పడినప్పుడు లోపల ఉన్న మెటీరియ‌ల్ క‌రిగిపోతుందే త‌ప్ప పేలుడు సంభ‌వించ‌దు. ఇంకా ఈ సిలిండర్ ప్రత్యేకతలు ఏమిటంటే..

సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్‌ ఎథీన్‌తో ఒక లేయ‌ర్‌ చేసి దానిపై గ్లాస్‌ ఫైబర్‌ వైండింగ్‌ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు టెంప‌రేచ‌ర్స్‌ వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు.ఈ సిలిండ‌ర్లు 5,10, 12, 15కిలోల ప‌రిమాణంతో త‌యార‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న ఈ సిలిండ‌ర్లు అన్ని టెస్టులకు క్లియ‌రెన్స్ ల‌భించిన త‌ర్వాత మార్కెట్లోకి వస్తాయి. వీటి సామ‌ర్థ్యం ప‌రిశీలించాల్సిందిగా అన్ని ప్ర‌భుత్వ ఎల్పీజీ సంస్థ‌ల‌కు వీటి శాంపుల్స్‌ను అంద‌జేసింది ఇండో గ్యాస్ సంస్థ‌. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా సిలిండ‌ర్ల‌ను అమెరికా, సౌత్‌కొరియా దేశాల్లో వినియోగిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)