కర్పూరం హెయిర్ ప్యాక్ తో రాత్రికి రాత్రే జుట్టు రాలే సమస్యకు చెక్ పడుతుంది!!

జుట్టు రాలడం పెట్టే ఇరిటేటింగ్ అంతా ఇంతా కాదు. వెంట్రుకలు రాలుతున్నాయని ఒత్తిడికి లోనయితే ఇంకా ఎక్కువ రాలుతాయని చాలా మందికి తెలియదు. తక్కువ వయసులోనే తలంతా రోజు రోజుకు బోసిపోతుండడంతో ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి తీసుకెళ్తోంది. ఎందుకంటే తల నిండా జుట్టుతో స్టయిలిష్ క్రాఫ్ లు అబ్బాయిల అందానికి సింబాలిక్ అయింది. జుట్టు ఎక్కువగా రాలడం మొదలైంది అంటే బట్టతల రాబోతోందని ఇండికేషన్. అందుకే ముందే అలర్ట్ అయి బట్టతల రాకుండా ఎఫెక్టివ్ రెమిడీస్ ని ఫాలో కావాలి. ఈ సమస్యను ఫేస్ చేసే వారికి కర్పూరం హెయిర్ మాస్క్ బెస్ట్ రెమిడీగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల హెల్తీ స్కాల్ప్ కి సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఫైబర్స్ ఉత్పత్తిని మెరుగుపరిచి, ఎలాస్టిసిటిని పెంచి జుట్టు కుదుళ్లు బలంగా మారడానికి సహాయపడుతుంది. కర్పూరంలో పునరుత్పత్తి గుణాలు ఉండటం వల్ల జుట్టు పెరుగుతదలకు సహాయపడుతుంది. కర్పూరంలో ఉన్న 40ప్రయోజనాలున్నాయి రాత్రికి రాత్రే మెరుగైన ఫలితాలను అందిస్తాయి. ఇంతకూ ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
కర్పూరం హెయిర్ ప్యాక్ తయారీ:
 • రెండు కర్పూరం బిల్లలు తీసుకుని పొడిచేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కర్పూరాన్ని డైరెక్ట్ గా తలపై రాసుకోకూడదు. కొద్దిగా హెయిర్ ఆయిల్ కలిపి మాత్రమే ఉపయోగించాలి.
 • సన్నని మంటపై 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలిపి వేడి చేయాలి. ఒక నిమిషం వేడి అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆయిల్ చల్లారనివ్వాలి.
 • ఒక గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో తీసుకోవాలి. బాగా కలబెట్టాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం, కర్పూరం పొడి కలపాలి. మంచి సువాసన రావడానికి కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేయాలి.
 • అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ముందు జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
 • ఇప్పుడు జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసి ఈ మాస్క్ ని బ్రష్ ఉపయోగించి అప్లయ్ చేయాలి. జుట్టు అంతటికి వెంట్రుకల కుదుళ్లకు చేరేలా పట్టించాలి.
 • ఈ మిశ్రమంతో వెంట్రుకల మొదళ్ల వద్ద చేతివేళ్లతో 5నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత జుట్టుని పైకి కట్టుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంటసేపు ఈ మాస్క్ తలపై ఉండాలి.
 • గంట తర్వాత జుట్టుని పెద్దగా కెమికల్స్ కలవని షాంపూ ఉపయోగించి, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఆర్గానిక్ షాంపూ అయితే మంచిది.
 • ఈ మాస్క్ అప్లై చేయడానికి ముందు మీ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొద్దిగా టెస్ట్ చేసుకోవడం మంచిది.
 • మీ వెంట్రుకలు కోల్పోయిన స్థాయిని బట్టి మీరు ఎన్నిసార్లు ఈ కర్పూరం హెయిర్ ప్యాక్ వేసుకోవడం ఆధారపడి ఉంటుంది.
 • జుట్టు రాలడం ప్రారంభ దశలోనే ఉంటే ఓవర్ నైట్స్ లోనే సమస్య తీరిపోతుంది.
 • ఎక్కువగా హెయిర్స్ కోల్పోయిన వారు వారానికి రెండు సార్లు చొప్పున వెంట్రుకలు వచ్చే వరకు చేయాలి.
 • దీనిని అనుభవ పూర్వకంగా వినిగించిన వారు బెస్ట్ టిప్ గా ఫీడ్ బ్యాక్ ఇచ్చారని వైద్యులు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)