18 ఏళ్ల కుర్రాడు శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయే కొత్తరకం "బ్రా" కనిపెట్టాడు

యూకేలో నివసిస్తున్న ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, అంటే రొమ్ము క్యాన్సర్ ఉంటోంది. జనాభా తక్కువున్న ఆస్ట్రేలియాలో పదిహేడు వేలకు పైగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవబోతున్నట్టు అంచనా. అమెరికాలో అయితే 66 వేలకు పైగా కేసులు నమోదు అవనున్నాయి. అదే ఇండియా తీసుకుంటే ప్రతి ఏడాది ఈ సంఖ్య లక్షన్నర దాటుతుంది. అందులో కనీసం 60% మహిళలు మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య ప్రతి ఏడాది మిలియన్ దరిదాపుల్లో ఉంటుంది. ఇవన్ని నమోదయ్యే కేసులే. నమోదవని కేసులు కూడా ఉంటాయిగా. చిన్నదేశాల్లో, చిన్న చిన్న ఊర్లలో రొమ్ము క్యాన్సర్ మీద ఎంతమందికి అవగాహన ఉంటుంది ? ఇప్పుడైనా అర్థం అవుతోందా ? రొమ్ము క్యాన్సర్ తేలిగ్గా తీసుకోవాల్సిన జబ్బు కాదు. ఇదో పెద్ద మహమ్మారి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న అబ్బాయి పేరు జూలియన్ రియోస్ కంటూ. ఇతను మెక్సికోకి చెందిన ఒక 18 ఏళ్ల కుర్రాడు. ఇతని తల్లి కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె పడ్డ బాధ అతడిని బాధపెట్టడమే కాదు, ఓ కొత్త బాటలోకి నడిపించింది. జూలియన్ తన స్నేహితులతో కలిసి హిజియా టెక్నాలజీస్ అనే ఓ కొత్త మెడికల్ కంపెనిని స్టార్ట్ చేసాడు. శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్న మెడికల్ పరిజ్ఞానం ఈ కంపెని సొంతం. తన తల్లి పడ్డ బాధ తనదాకా వచ్చిన ఏ తల్లి పడకూడదని ఓ కొత్తరకమైన బ్రా కనిపెట్టాడు జూలియన్. ఇది రొమ్ము క్యాన్సర్ ని తొలిదశలోనే పసిగడుతుందట.

ఈ బ్రా పేరు ఈవా. ఇది రక్త ప్రసరణ, రొమ్ముల్లో టెంపరేచర్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ట్యూమర్, క్యాన్సర్ .. ఏది మొదలవుతున్నా పసిగడుతుందట. ఈ కొత్తరకమైన బ్రాకి Global Student Entrepreneur Awards (GSEA) లో ప్రథమ బహుమతి లభించింది. ఇక్కడే అర్థం చేసుకోండి జూలియన్ తన స్నేహితులతో కలిసి తయారుచేసుకొని ఈ కొత్త బ్రా ఎంత ప్రభావావంతంగా పనిచేస్తుందో.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)