అన్ని రోగాలకు ఒకే మందు కనుగొని అద్భుతం చేసాడు.. జనాలకి మంచి చేసినందుకు జైల్లో పెట్టి హింసించారు

ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం.. క్రిములు, వైరస్‌‌, బ్యాక్టీరియాల వల్లే రోగాలు వస్తాయి. ఇలా వచ్చిన రోగాలను తగ్గించాలంటే రసాయనాలు ఉపయోగించాలన్నది ఆధునిక చికిత్సా పద్ధతి. అయితే, ఈ పద్ధతిలో మాత్రలు, వ్యాక్సిన్లు, టీకాలు, రేడియోలాజిక్‌ చికిత్సలు మొదలైన వాటితో రోగాలను పూర్తిగా తగ్గించిన సందర్భాలు లేవని అమెరికాకు చెందిన డాక్టర్‌ సేబీ అన్నారు. క్రిములు, వైరస్‌, బ్యాక్టీరియాలు రోగ మూల కారకాలు కావని అంటారు. వాస్తవానికి రకరకాల వ్యాధులు లేవని, ఉన్నది ఒకే వ్యాధి అని, ఆ వ్యాధి ‘శ్లేష్మ ప్రకోపం అని చెప్పారు. ‘‘శ్వాస నాళాల్లో శ్లేష్మం పేరుకుపోతే శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోతే నిమోనియా, పాంక్రియాసిస్‌లో పేరుకుపోతే మదుమేహం, గుండెలో పేరుకుపోతే గుండెజబ్బులు వస్తాయి. శరీరంలో ఎక్కడ శ్లేష్మం పేరుకుపోతే అక్కడ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మదుమేహం, గుండెజబ్బులు మొదలైనవి వ్యాధులు కావు, అవి వ్యాధి లక్షణాలు’’ అని డాక్టర్‌ సెబీ పేర్కొన్నారు. అయనది ఒకే రోగం.. ఒకే మందు సిద్ధాంతం. సహజమైన వాటిని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అంటారు. సహజ సిద్ధమైన మూలికలతో ఆయన మదుమేహం, కేన్సర్‌, గుండెజబ్బు, చివరికి ఎయిడ్స్‌ కూడా తగ్గించాడని పేర్కొంటారు.

ఎవరీ డాక్టర్‌ సెబీ?
మెక్సికోలోని హొందురస్‌లో 1933లో సెబీ జన్మించాడు. సెబీ ఎప్పుడూ బడికి వెళ్లలేదు. నానమ్మ దగ్గర చదవడం, రాయడం నేర్చుకున్నాడు. బాల్యంలో ఎక్కువగా నదులు, పచ్చికబయల్లో ఆడుకునే వాడు. పెద్దయ్యాక అమెరికా వచ్చాడు. ఇక్కడ అతడికి ఆస్తమా, మదుమేహం, ఊబకాయం, ఇతర బలహీనతలు వచ్చాయి. ఆధునికి చికిత్సలు ఎన్ని తీసుకున్నా ఫలితం రాలేదు. దీంతో, మెక్సికో అడవుల్లో ఉండే ఓ మూలికా వైద్యున్ని సంప్రదించాడు. అతడు సేబీ వ్యాధులన్నింటినీ మూలికలతో పూర్తిగా తగ్గించాడు. దీంతో మూలికా వైద్యం సెబీకి ఆసక్తి పెరిగింది. దానిపై పరిశోదన చేయడం మొదలు పెట్టాడు. అతడు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలిపేవాడు. అన్ని రోగాలకు ఒకే మందు కనుగొన్నాడు. అయితే, మూలికలతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ సెబీనీ పోలీసులు జైల్లో పెట్టారు. తన ఔషధం ద్వారా రోగాలు తగ్గించుకున్న వారిని కోర్టులో హాజరు పర్చి నిర్దోషిగా బయట పడ్డాడు. హోందురస్‌లో యూఎస్‌హెచ్‌ఏ హీలింగ్‌ రిసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కేంద్రం ద్వారా సహజ సిద్దమైన వాటితో చేసిన ఔషధాన్ని ‘సెల్‌ ఫుడ్‌’ పేరుతో రోగులకు అందిస్తుంటారు. కాగా, డాక్టర్‌ సెబీ 2016లో చనిపోయారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)