జన్మ తేదిలను బట్టి వీటిని ఇంట్లో పెట్టుకుంటే…అన్ని కష్టాలు పోయి అదృష్టం కలసి వస్తుంది

పుట్టిన తేదిని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. జన్మ తేదిలను బట్టి ఈ క్రింది వస్తువులు ఇంట్లో ఉంటె కష్టాలు అన్నీ పోయి అదృష్టం కలసి వస్తుంది…

1 వ తేది… ఏదైనా నెలలో ఒకటో తేదిని జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ (వేణువు)ను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి.

2వ తేది…

పుట్టిన తేది 2 అయినా కలిపినా కూడా మొత్తం 2 వచ్చినా కూడా గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయవ్య దిశలో ఉంచాలి. ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

౩వ తేది…

రుద్రాక్షను ౩ వ తేది పుట్టిన వారు ఈశాన్య దిక్కులో ఉంచాలి. అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకండి.

4వ తేది…

అద్దాలను ధీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కులుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

5 వ తేది…

కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీని వల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది.

6 వ తేది…

ఈ తేదీలో పుట్టిన వారు నెమలి పింఛాన్ని ఇంట్లోని ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది.

7 వ తేది…

ఆగ్నేయ దిశగా ముదురు రంగులో ఉన్న రుద్రాక్షను ఉంచాలి.

8 వ తేది…

ఎనిమిది జనన తేది అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగెటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

9 వతేదీ…

పిరమిడ్‌ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలిగిపోతాయి.

అలాగే రెండి డిజిట్లలో పుట్టిన మొత్తం కలిపితే వచ్చే అంకె లెక్కలలోకి తీసుకోవాలి.23 అయితే 2 +3=5 అంటే వారి పుట్టిన తేది 5. అలా చూసుకుని మీ జన్మ తేదిని బట్టి ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుని అదృష్టవంతులు కండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)