మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోండి ఇలా

Loading...
మొమోరి కార్డ్ ఇక్కడ అందరు వాడుతున్నారుగా. స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకున్నా, చిన్న మొబైల్స్ లేదా మ్యూజిక్ ప్లేయర్స్ లో మెమోరి కార్డ్ వాడుతుంటారుగా. ఈ మెమోరి కార్డ్ అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతుంది. ఆ చిక్కులు మీకు తెలియనివి కావు చూడనివి కావు. మెమోరిలో ఏదో వైరస్ చేరడం వలనో, కరప్ట్ ఫైల్ చేరటం వలనో, మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ మెమోరి కార్డు పట్టుకోని మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి.
  • కార్డ్ రీడర్ ద్వారా మీ మొమోరి కార్డ్ ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసాక, అది ఏ డిస్క్ లో కనబడుతోందో చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే, Removable Disk (I:) ఇలా అన్నామాట.
  • ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. అంటే కీబోర్డు మీద Windows + R క్లిక్ చేసి Run లోకి వెళ్ళి, cmd అని టైప్ చేసి ఒకే చేయాండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.
  • కమాంట్ ప్రాంప్ట్ లో chkdsk I: /r అని టైప్ చేయాలి. ఇక్కడ I అక్షరం మీ మెమోరి కార్డ్ ఉన్న డిస్క్ అన్నమాట. మీ డిస్క్ ఒకవేళ Removable Disk (M:) అయితే M అని, ఇంకే అక్షరంతో ఉంటే అక్కడ ఆ అక్షరాన్ని వాడాలి.
  • అంతే, విండోస్ మీ మెమోరి కార్డులో ఉన్న సమస్యలను గుర్తించి రిపేర్ చేస్తుంది.
  • ఒక ముఖ్య గమనిక. మీకు అత్యవసరమైన ఫైల్స్ కి మాత్రం ముందే ఓ బ్యాకప్ పెట్టుకొని రిపేర్ చేసుకోండి.
Loading...

Popular Posts