స్పటికమాలతో ఇలా చేస్తే విశేష ధనప్రాప్తి కలుగుతుంది

స్పటికతో రూపొందిన శ్రీ యంత్రం లేదా శ్రీ చక్రం శుక్రవారం నాడు శుభ ముహూర్తాన ఇంట్లో గాని, వ్యాపారస్తులు తమ షాపుల్లో గాని స్థాపించాలి. దానికి నియమానుసారం పూజ చేస్తే విశేష ధనప్రాప్తి కలుగుతుంది.

దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో రావలసిన పైకం సకాలంలో అందుతుంది. అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. శ్రీయంత్రాన్ని నిత్యం క్రమం తప్పకుండా పూజించాలి. స్పటికమాల ధరించి “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అని జపిస్తే అవసరానికి ధనం సమకూరుతుంది.

ఇలా చేయడం వలన అతిత్వరలో ఋణవిముక్తులు అవుతారని శాస్త్రం ప్రగాడంగా స్పష్టం చేస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది.

Popular Posts

Latest Posts