ఏసీ కొంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. ఏసీ కొనేటప్పుడు పొరపాటున కూడా ఈ విషయాన్నీ మర్చిపోకండి

 • ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కాస్తంత వయస్సు మీద పడిన వారు ఉదయం 11 దాటితే బయటకు రావడం గగనం అయిపోతోంది. ఇపుడే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందో ఉహించడానికే భయం వేస్తోంది. ఇళ్లలో ఫ్యాన్‌లు ఉన్నా వేడిగాలే వీస్తుంటుంది. మరి ఏం చేయాలి..! దీనికి పరిష్కారం ఏసీ కొనుగోలు చేయడం ఒక్కటే అని చాలా మంది దుకాణాలకు పరిగెట్టే పరిస్థితి.
 • ఏసీ కొనడమంటే మాటలా! కనీసం 30 వేలన్నా చేతిలో లేనిదే నాణ్యమైన స్టార్‌ రేటింగ్‌ ఏసీ రాదు. పైగా రకరకాల కంపెనీలు, టన్నేజి లెక్కలు, టెక్నాలజీ హొయలు అన్నీ ఇన్నీ కావు.. ఏది ఎంపిక చేసుకోవాలో ఒక పట్టాన అర్థం కాదు. షోరూమ్‌కు వెళితే ఏసీలన్నీ ఒకేలా కనిపిస్తాయి. వాటి గురించి చెప్పేదెవరు? సేల్స్‌ మేన్‌ చేప్పినా నిర్వహణ గురించి వివరాలడగాలంటే మొహమాటం. మరి కొత్తగా కొనుగోలు చేసేటపుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఎంటి? తెలుసుకుందాం.
 • ఏసీలు మూడు రకాలు 
 • సాధారణంగా ఏసీలు నాలుగు రకాలు. విండో ఏసీలు, స్ప్లిట్‌ ఏసీలు, టవర్‌, రూఫ్‌ ఏసీలు. మనం ఉపయోగించే గదిని బట్టి మోడల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 0.75 టన్నేజి నుంచి మూడు టన్నుల సామర్థ్యం వరకు సామ్‌సంగ్‌, వోల్టాస్‌, హిటాచి, డైకన్‌, ఎల్‌జి, గోడ్రేజ్‌, ఒనిడా, క్యారియర్‌ వంటి కంపెనీలు చాలా ఉన్నాయి.
 • విండో ఏసీలకు కాలం చెల్లినట్లే
 • ఒకపుడు ఏసీ అంటే విండో ఏసీలే. గదిలో కిటికీ ఉంటే చాలు. పడకగది, హాలు, కార్యాలయం ఎక్కడైనా వీటిని సులువుగా అమర్చుకోవచ్చు. బ్లోయర్‌, కంప్రెషర్‌ పక్క పక్కనే ఉండటం వల్ల పనిచేసినంత సేపు శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ప్రస్తుతం చాలా మంది వాడటానికి ఇష్టపడటం లేదు.
 • స్ల్పిట్‌, టవర్‌, రూఫ్‌ రకాలకే ఆదరణ
 • విండో ఏసీలు పెట్టుకునే వీలు లేని వారంతా స్ల్పిట్‌ ఏసీలను అమర్చుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా కిటికీలతో పని లేదు. కంప్రెషర్‌, ఫ్యాన్‌ను బయట ఎక్కడో ఏర్పాటు చేసుకుని చల్లటి గాలిని ఇచ్చే బ్లోయర్‌ను మాత్రం గదిలో అమర్చుకోవడమే. స్ల్పిట్‌ ఏసీ 22 అడుగుల వరకు చల్లటి గాలిని ఇస్తుంది. కంప్రెషర్‌ను బ్లోయర్‌ను కలపడానికి నాలుగు మీటర్ల కాపర్‌ పైపులను ఇస్తారు. ఈ పైపును జాగ్రత్తగా చూసుకోవాలి. కంప్రెషర్‌ బయట ఉంటే ఎండకు, వానకు పాడవుతుందనే దిగులు అవసరం లేదు. దీనిని గోడకు, ఇంటి పైకప్పు, బాల్కనీ, ఎక్కడైనా అమర్చుకోవచ్చు.
 • విండో ఏసీతో గది చల్లబడటానికి 30 నిమిషాలు పడితే స్ల్పిట్‌తో 20 నిమిషాలు పడుతుంది. టవర్‌ ఏసీలయితే రెస్టారెంట్‌కు, మీటింగ్‌ హాల్సుకు బాగుంటాయి. కిటికీలు లేని చోట, గోడకు ఏసీలు పెట్టుకునే ఏర్పాటు లేనపుడు టవర్‌ ఏసీలను ఏర్పాటు చేసుకోవచ్చు. 20-25 అడుగుల దూరం వరకు చల్లటి గాలి వీస్తుంది. 100 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది.
 • ఇక రూఫ్‌ ఏసీలయితే సీలింగ్‌కు అమర్చుకోవచ్చు. స్ల్పిట్‌, టవర్‌ ఏసీలకు మల్లే కంప్రెషర్‌లను బయట ఏర్పాటు చేసుకోవచ్చు. కల్యాణ మండపాలు, మినీ హాల్సు, రెస్టారెంట్‌లకు బాగుంటాయి.
 • విద్యుత్ వినియోగం
 • ఏసీని ఎన్ని గంటలు పనిచేయిస్తే ఎంత విద్యుత్ కాలుతుందో కూడా అవగాహన కలిగి ఉండాలి. గది విస్తీర్ణం ఎంత? గాలి వేగం ఎంత? వంటి అంశాలను గమనంలోకి తీసుకోవాలి. సాధారణంగా ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసిని తొమ్మిది గంటలు వాడితే 4.5 గంటలు విద్యుత్‌ను తీసుకుంటుంది. దీనికి సుమారు 5 యూనిట్లు కరెంటు ఖర్చు అవుతుంది. 1.5 టన్ను సామర్థ్యం అయితే ఎనిమిది నుంచి పది యూనిట్ల విద్యుత్‌ను వాడుకుంటుంది. కాకపోతే ఏసీ ఉన్న గదిలో గాలి బయటకు పోవడానికి మార్గం, ఇనుప వస్తువులు, చెక్క వస్తువులు ఎక్కువగా ఉండకూడదు. ఉంటే విద్యుత్‌ను ఎక్కువగా వాడుకుంటాయి.
 • మన్నిక ఎలా?
 • వేల రూపాయలు పోసి కొన్న ఏసీలు నాలుగు కాలాల పాటుమన్నికగా ఉండాలంటే వాటి అమరిక చాలా ముఖ్యం. అన్ని రకాల ఏసీలకు వర్తించే కొన్ని నిర్వహణా చిట్కాలు ఉన్నాయి.
 • ముఖ్యంగా వోల్టేజి హెచ్చు తగ్గులకు ఏసీ పాడవకుండా స్టెబిలైజర్‌ ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని మోడళ్లలో స్టెబిలైజర్‌లు కలిసే వస్తున్నాయి.
 • ఎంసీబీని తప్పని సరిగా వాడాలి. కారణం ఏసీని అన్‌ చేసినపుడు ఒకే సారి ఎక్కువ కరెంటును తీసుకుటుంది. అలాంటపుడు లోడ్‌ తట్టుకోవడానికి ఇవి పనికొస్తాయి.
 • ఏసీలు ఉండే గదిలో వైరింగ్‌ 720 గేజ్‌ ఉండాలి. లేదంటే లోడ్‌ పెరిగి వైర్లు హీటెక్కుతాయి. షార్టుసర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంది.
 • ఏసీని వాడుతున్నపుడు పంపుసెట్‌లు, మైక్రొవోవెన్‌లు, గీజర్‌లు వాడొద్దు.
 • ఏసి ఉన్న గదిలో తలుపులు, కిటీకీలు మూసి ఉంచాలి. లేకుంటే లోపలి చల్లదనం బయటకు పోవడం వల్ల ఏసీ ఎంత సేపు పని చేసినా గది చల్లబడదు. పైగా విద్యుత్‌ను ఎక్కువగా వాడుకోవడం వల్ల బిల్లు తడిసి మోపుడు అవుతుంది.
 • విండో ఏసీలయితే వెనుక వైపున కనీసం ఆరు అంగుళాల స్థలం ఉండేలా చూసుకోవాలి. కంప్రెఫర్‌కు గాలి చక్కగా తగిలితే భారం తగ్గుతుంది. లేకపోతే లోడ్‌ ఎక్కువ పడి ట్రిప్‌ అవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)