ఈ 8 వస్తువులను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోండి.. షుగర్ దెబ్బకు దిగొస్తుంది!!

Loading...
షుగర్.. మహమ్మారి ఇప్పుడు చాలా ఈజీగా అందరినీ ఎటాక్ అయిపోతోంది. షుగర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దానికి మనం ఏమీ చేయలేమా? ఇటువంటి విషయాలపై దృష్టిపెట్టే తీరిక లేక చాలా మంది.. డయాబెటిస్ డాక్టర్ ని సంప్రదించడం, వారు రాసిచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడడం చేస్తున్నారు. ఇలా చేస్తే జీవితకాలం మెడిసిన్ వాడక తప్పదని తెలిసినా ప్రత్యామ్నాయంపై ఏమాత్రం శ్రద్ధవహించడంలేదు. అయితే ఇటీవల కొందరు మాత్రం శాశ్వత పరిష్కారానికి అన్వేషణ మొదలుపెట్టారు. మన సంప్రదాయక వంట దినుసుల్లో షుగర్ ను కంట్రోల్ లోకి తీసుకొచ్చే అద్భుత లక్షణాలున్నాయి. కింద చెప్పిన 8 వస్తువులను మీ రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకోండి.. కొద్ది రోజుల్లోనే మంచి రిజల్టు వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అవేమిటో కింద తెలుసుకోండి..
  • మెంతులు: బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో మెంతులు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. పురాతన కాలం నుంచి మెంతులను డైట్‌లో చేర్చుకుంటున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగ్యులర్ డైట్‌లో మెంతులు చేర్చుకోవాలి.
  • తులసి: తులసి ఆకు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని వేగంగా తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఇందులో ఉండే మెడికల్ గుణాల కారణంగా తులసి ఆకును చాలా ముఖ్యమైన మూలికగా ఆయుర్వేదం చెబుతుంది. రెగ్యులర్‌గా తులసి ఆకు తింటూ ఉండటం వల్ల డయాబెటిస్‌ని కంట్రోల్ చేయవచ్చు.
  • సోంప్: సోంఫ్‌లో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ C ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
  • వెల్లుల్లి: రకరకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు నివారించడానికి వెల్లుల్లిని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నాం. డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. రెగ్యులర్‌గా వెల్లుల్లిని తీసుకుంటూ ఉండటం వల్ల ఇన్సులిన్ పెరిగి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
  • అల్లం: చిన్న అల్లం ముక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట. ఇందులో ఉండే ఎంజైమ్ డయాబెటిస్‌తో పోరాడే సత్తా కలిగి ఉంటుంది.
  • జీలకర్ర: జీలకర్రలో ఉండే గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌తో పాటు, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి జీలకర్రను డైట్‌లో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
  • లవంగాలు: లవంగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్‌తో పోరాడే అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో ఉంటాయని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎక్కువకాలం రెగ్యులర్‌గా లవంగాలను డయాబెటిక్ పేషంట్స్ తీసుకుంటూ ఉంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
  • పసుపు: డయాబెటిస్‌తో పోరాడే దినుసుల్లో పసుపు ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి.
Loading...

Popular Posts