పెరుగును ఈ 10 పదార్థాలతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలెన్నో.

  • పెరుగు ను ఇష్టపడని వారుండరు…ఏ కొంతమందో పాలు,పెరుగు పాల పదార్దాలు అంటే అయిష్టత చూపుతారు కానీ..చాలామంది పెరుగు ఇష్టంగా తింటారు..సమ్మర్ వచ్చేసింది పెరుగు ,మజ్జిగ ఉంటే చాలు అనుకునే వారు ఉంటారు…కానీ పెరుగును కేవలం అన్నంలో మాత్రమే తినకుండా..ఈ కింది పదార్దాలతో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టోచ్చు..
  • పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి
  • కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
  • కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
  • కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. 
  • పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినడం వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నపిల్లల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
  • కొంచెం వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
  • ఓ క‌ప్పు పెరుగులో కొంచెం న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినడం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. 
  • పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది
  • పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
  • పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

Popular Posts

Latest Posts