శివుని దృష్టిలో ఈ పనులు చేస్తే వారికి పాప విముక్తి ఉండదు

 • శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. అని అందరికీ తెలిసిందే. అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ దైవాజ్ఞ లేకుండా జరగవని అర్ధం. పరమశివుడిని భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. శివుడు అమాయకుడైనా.. ఆ దేవ దేవుడికి కోపం వస్తే తట్టుకోవడం ఎవరితరమూ కాదు. శివుడి కోపం ఎంత తీవ్రమైందంటే.. శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. వారు శివరాత్రి పూజలు చేసినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం దక్కదట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 • శివుని ప్రకారం ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు. అవే.. ఆలోచనతో, చేష్టలతో మరియు మాటలతో…
 • ఆడ, మగాళ్లలో ఎవరైనా ఇతరులు భార్య/ భర్తను పొందాలనే దురాలోచన చేస్తే శివుడి దృష్టిలో క్షమించరాని పాపం.
 • ఇతరుల సంపదని అక్రమంగా పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం.
 • తెలిసి మనుషులను ఆవమానించడం.ముఖ్యంగా ఆడవాళ్ళను అస్సలు అవమానించరాదు.
 • అలాగే భర్త పోయిన స్త్రీ ని పుణ్య కార్యాలకు పిలువకపోవడం కూడా తప్పే అని శివుడు చెబుతున్నాడు ఎందుకంటే ఆయుషు అనేది ఒకరిచేతులో ఉండదు. అల కనుక అవమానించి అవతలవారిని బాధపెడితే మరో జన్మలో మనకి అటువంటి జీవితమే వస్తుంది అని శాపం.
 • ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని, వారి కలలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం.
 • ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా, ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపం.
 •  గర్భిణి స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం.
 • దురుద్దేశంతో ఇతరుల కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగించేలా అబద్ధాలు చెప్పడం క్షమించరాని పాపం.
 • అనవసరమైన పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపం.
 • హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్న పిల్లలు లేదా బలహీనపై ప్రతాపం చూపించడం క్షమించరాని పాపం.
 • ఒక అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం.
 • కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం.
 • గురువులు, తల్లితండ్రులు, వృద్దులు, సన్యాసులు, వికలాంగులను తిట్టినా లేదా వారిపై చేయ్యిచేసుకున్నా శివుని దృష్టిలో అది మహాపాపం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)