గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. మరి 40 లక్షలు వస్తాయని తెలుసా ?

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా కూడా గ్యాస్‌ సౌవ్‌ కనిపిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం భారీ రాయితీలను కల్పించి మరీ పేద వారికి గ్యాస్‌లను అందిస్తుంది. ఇండియాలో దాదాపు 75 శాతం కుటుంబాలు గ్యాస్‌ను వాడుతున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది. అయితే గ్యాస్‌ అయితే వాడుతున్నారు, కాని గ్యాస్‌ వల్ల కలిగే లాభాలు, గ్యాస్‌ పేళినప్పుడు వచ్చే ఇన్సురెన్స్‌లు మాత్రం వినియోగదారులకు తెలియడం లేదు. వినియోగదారుల వరకు ఏంటి గ్యాస్‌ ఏజెన్సీ ఉద్యోగులకు కూడా ఇన్సురెన్స్‌ గురించి తెలియదు. కేంద్ర ప్రభుత్వం మరియు గ్యాస్‌ సంస్థలు అన్ని కలిసి ఈ ఇన్సురెన్స్‌ను ఇస్తాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేళి ఒక వ్యక్తి మరణిస్తే 40 లక్షల ఇన్సురెన్స్‌ మరియు అదే విధంగా గ్యాస్‌ సిలిండర్‌ పేళి ఎవరైనా గాయాల పాలు అయితే 30 లక్షల వరకు ఇన్సురెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఈ విషయాన్ని ప్రభుత్వాలు కాని, గ్యాస్‌ ఏజెన్సీలు కాని పట్టించుకోవడం లేదు. దేశంలో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే ఈ ఇన్సిరెన్స్‌ అందిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వేల సంఖ్యలో గ్యాస్‌ పేళిన సంఘటనలు నమోదు అయ్యాయి. వాటన్నింటికి మాత్రం గ్యాస్‌ ఏజెన్సీలు మరియు కంపెనీలు ఇన్సురెన్స్‌ను క్లైమ్‌ చేయలేదు. ఈ సమాచారం అందరికి చేరేలా కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉంది. కాని కేంద్రం మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా గ్యాస్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సమాచారం మనం అయినా అందరికి తెలిసేలా షేర్‌ చేద్దాం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)