దరిద్రపు టీవీ9 లేని సమాజం కోసం టీవీ9 ని పూర్తిగా బహిష్కరిస్తున్నాం.. టీవీ9 పై చాగంటి అభిమానులు హిందువులు చేస్తున్న ప్రతిజ్ఞ

టీవీ9పై చాగంటి అభిమానుల కోపం చల్లారడం లేదు… పైగా అది ఇంకా ఎక్కువవుతున్నది… ఆయన ప్రవచనాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది… పైగా ప్రవచనాలకు వెళ్తే ఆయన ఫీజు తీసుకోడు, మహా అయితే రవాణా ఖర్చులు తీసుకుంటాడేమో… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి… సరళమైన భాషలో చెబుతాడు కాబట్టి మహిళలు, పెద్దలు ప్రధానంగా ఆయన ప్రవచనాల పట్ల చాలా ఇష్టాన్ని చూపిస్తారు… అయితే తన ప్రవచనాల్లోని పలు అంశాలు, ఉదాహరణకు భర్త గోచీ ఉతికితేనే భార్య జీవితానికి సార్థకత వంటివి వివాదాలకు దారితీశాయి… తాజా వివాదం మాత్రం ఓ సామాజికవర్గంతో… ‘తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు’ అన్న ఆయన వ్యాఖ్య తమను అవమానించినట్టుందని యాదవ సంఘాలు ఆందోళన చేశాయి… తరువాత పలువురు యాదవ పెద్దలు వెళ్లి ఆయన్ని ఇదే అడిగారు, ఆయన చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాడు… అయినా తెలియకుండా హర్ట్ చేసి ఉంటే క్షమించండీ అని హుందాగా అడిగాడు… వాళ్లూ అంతే మర్యాదగా మాట్లాడారు… అయితే కథ అక్కడ ముగిసిపోలేదు…

అసలే హిందువులన్నా, హిందూ సమాజమన్నా టీవీ9 కి విపరీతమైన కక్ష ఇది అందరికీ తెలిసిన సత్యమే. చాగంటిపైకి యాదవుల్ని ఉసిగొల్పటానికే ఇలా తప్పుడు ప్రచారంతో, ఉద్దేశపూర్వకంగా, కేవలం సంచలనం కోసమే  చాగంటిపై కసితోనే టీవీ9 రచ్చ రచ్చ చేసిందీ అనేది ఇప్పుడు అభియోగం… అందుకే కొందరు change.org లో సంతకాలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు… ఈవివాదంతో మనసు చెదిరిన ఆయన ఇకపై తను ప్రవచనాలు చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాడూ అని వార్తలు వస్తున్నాయి… ఎవరిమీదో అలిగి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైతే లేదు… చాగంటి ప్రవచనాల్ని ఇక వినలేం అనే కోపంతో… ఇదేసమయంలో ఫేస్ బుక్ లో చాలామంది చాగంటి అభిమానులు ‘‘దరిద్రపు టీవీ9 లేని సమాజం కోసం మేం ఇకపై టీవీ9 చూడం, ఇంటర్నెట్ లో మరియు యూట్యూబ్ లో టీవీ9 ని పూర్తిగా బహిష్కరిస్తున్నాం. మా వల్ల ఒక్క పైసా ఆదాయం ఆ టీవీకి రానీయకూడదని మేము ప్రతిజ్ఞచేస్తున్నాము  ’’ అనే నినాదాన్ని షేర్ చేసుకుంటున్నారు… ఇది టీవీ9 పట్ల ఒకరకంగా అభిశంసన.


ఈ రోజు  ఓ పెద్దమనిషి చాగంటి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు… చాగంటి ఉదహరించినదీ, ప్రస్తావించినదీ ఏమిటంటే… తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు… అంటే ఇక్కడ కడగడం అని కాదు… నిజానికి అది ‘తలకు అడిగితే మొలకు అడగరు, మొలకు అడిగితే తలకు అడగరు’… అంటే వస్త్రదానం సమయంలో సాధారణంగా రెండు వస్త్రాలను తీసుకుంటూ ఉంటారు… అంటే ఒకటి కండువా, ఇది తలకు… మరొకటి ధోవతి, ఇది మొలకు… అయితే ఒకటికి రెండు కూడా అడిగి తీసుకోలేని అమాయకులు యాదవులు అని చెప్పడం దాని ఉద్దేశం…. ఇదీ ఆ పెద్దమనిషి వివరణ… ఇదే దానికి అసలైన వివరణ. 
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)