క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ కోసం చాగంటి పై టీవీ9 నీచమైన కుట్ర..

చాగంటి ప్రవచనాలను కొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదం చేయాలని భావిస్తున్నారా..? దీనికి రాజకీయ కోణం ఉందా..? హిందూమతాన్ని అణిచివేసే కుట్ర ఉందా..? ఈ చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్నది… ప్రత్యేకించి బ్రాహ్మణ సమాజం దీన్నే అనుమానిస్తున్నది… దీన్ని హిందూమతంపై సాగుతున్న కుట్రలో భాగమేనని విశ్వసిస్తున్నది… అయితే చాగంటి వివాదం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా..? ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? దీనిపై ఎవరూ స్పష్టంగా ఇదీ అని చెప్పలేకపోయినా… సందేహాలు బలంగా వ్యక్తమవుతుండటం మాత్రం నిజం… సరే, రాజకీయ కోణం అనేది ఓసారి సగటుమనిషి దృక్కోణంలో, పైపైన విశ్లేషిస్తూ ఆలోచిద్దాం.

ఏపీలో ఎవరికి ఆ అవసరం ఉంది..? అంటే ఏ రాజకీయ పార్టీకి ఆ అవసరం ఉంది..? బీజేపీ ఆ పనిచేయదు, నడుం విరిగి కూలబడిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కుట్రలు పన్నేంత సీన్ లేదు… ఇక వైసీపీ… నిజానికి అర్బన్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మద్దతు సమీకరించుకోవడంలో గత ఎన్నికల్లో కొంత విఫలమైన జగన్, ఆ వర్గాల యాక్సెప్టెన్సీ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు… తను హైందవ విశ్వాసాలకు అస్సలు వ్యతిరేకిని కానని చెప్పుకోవడం తన అవసరం… పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు, ఉత్తరాఖండ్ యాగాలు, దోషనివారణ పూజలు, ఆలయాల సందర్శనలు అందుకే… చంద్రబాబు అండ్ కో కావాలని జేసీ వంటి నేతల్ని ఉసిగొల్పి, ముందు నిలబెట్టి కల్తీరెడ్డి, క్రిస్టియన్ రెడ్డి వంటి విపరీత వ్యాఖ్యలతో దాడి చేయిస్తున్న నేపథ్యంలో జగన్ చాగంటి ప్రవచనాలు వంటి వివాదాల్లో అస్సలు జోక్యం చేసుకోడు… ఇక మిగిలింది తెలుగుదేశం… తనకు కాస్తోకూస్తో మద్దతున్న మిడిల్ క్లాస్‌ను చంద్రబాబు దూరం చేసుకోడు… ఇక తెలంగాణ… స్వతహాగా హిందూ ధర్మం, పద్ధతులపై అమిత విశ్వాసమున్న కేసీయార్ చాగంటి వివాదాల్లాంటివి అస్సలు పట్టించుకోడు… అవసరమైతే తనే దండం పెట్టి, సత్కారం చేస్తాడు తప్ప వ్యతిరేకంగా పోడు… కాంగ్రెస్‌కు వాళ్ల గోచీ సర్దుకోవడమే వాళ్లకు సరిగ్గా చేతకావడం లేదు… అందుకే చాగంటి వివాదం వెనుక రాజకీయ కుట్ర, రాజకీయ కోణం అనేవి ఏమీ లేదు.

ఈ వీడియోలో 2.30 నిమిషాల నుంచి జాగ్రత్తగా చూడండి…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)