ఈ రెండు కలిపి తీసుకుంటే వెంటనే నిద్రపోతారు

Loading...
ఎంత బలవర్థక ఆహారం తీసుకున్నా… వాకింగ్‌లు, జాగింగ్‌లు, వ్యాయామాలు చేసినా నిద్ర లేకపోతే ప్రయోజనం శూన్యం. ఎందుకంటే నిద్రలేమి వల్ల సమస్త జీవక్రియలు కుంటుపడతాయి. ఫలితంగా ఎంతటి పోషకాహారం తీసుకున్నా వాటిల్లోని పోషక పదార్థాలను గ్రహించే స్థితిలో ధాతు వ్యవస్థ ఉండదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీర్ణక్రియతోపాటు విసర్జన క్రియ కూడా మందగిస్తుంది. ఫలితంగా శరీరం నిండా వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి శరీరంలో ఆక్సీజన్‌ నిల్వలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. వీటన్నింటికీ నిద్రలేమే కారణం. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతాయి. నీరసం, నిస్సత్తువ ఆవరించి వృతిపరమైన సామర్థ్యం తగ్గిపోతుంది.

ఈ సమస్య నుంచి బయటపడటానికి నిద్ర మాత్రలు వేసుకోవడానికి సిద్ధపడితే అదొక వ్యసనంగా పరిణమించవచ్చు. అలా రోజూ ఆ మాత్రలు వేసుకోవాల్సిన స్థితి ఏర్పడితే, ఏ ఒక్క రోజు ఆ మాత్ర వేసుకోకపోయినా అసలే నిద్ర రాకపోవచ్చు. అందువల్ల పౌష్టికాహారం, వ్యాయామాలకు ప్రాధాన్యతనిస్తూనే, రోజూ నిద్రపోయేముందు గ్లాసుడు పాలలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవు.
Loading...

Popular Posts