మీ ఇంట్లో డబ్బులు వర్షం లాగా కురవాలంటే

Loading...
మనం ఏ పని చేసిన దానికి ఏదోక కారణం డబ్బు అయ్యి ఉంటుంది అందుకే ఆ డబ్బుని మనకి అందేలాగా కటాక్షించే లక్ష్మి దేవికి కోపం తెప్పించేవి ఏమిటో చూద్దామా.
  • సాయంత్రం వేళ అస్సలు నిద్రించకూడదు
సాయంత్రం 5 లేదా 6 మధ్యలో అస్సలు నిద్రించరాదు, ఇది ఇంట్లో దరిద్రాన్ని సూచిస్తుంది అందుకే సాయంత్రం నిద్ర అస్సలు పోరాదు. (దీనిలో ఉన్న సైన్స్ లాజిక్ ఏంటంటే ఆ టైం లో మనిషి నిద్రపోవడం వలన శరీరం నిరుత్సాహంగా తయారవుతుంది. మెదడు పని తీరు మందగించి ఆలోచన శక్తీ తగ్గిపోతుంది ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అప్పుడు ఏ పని చేసిన తగిన సామర్ధ్యం లేక ఆ పని పూర్తవదు. )
  • పాదాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి
మన పాదాలు పాజిటివ్ ఎనేర్జి కి సంకేతం అంటే మన శక్తి మొత్తం పాదాలలో ఉంటుంది అందుకే పాదాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ( పాదాలు నుండి ప్రతి అవయవానికి సంబంధం ఉంటుంది కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి )
  • వంట గదిలో స్టవ్ కింద
మనం మన ఇంటిని దేవాలయం లాగా పూజిస్తాము. అందుకే ఎల్లపుడు వంట గదిని శుభ్రంగా ఉంచుకుని స్టవ్ కింద ముగ్గు వెయ్యాలి ఎందుకంటే పంచ భూతలను అవమానిస్తే లక్ష్మి దేవి కనుకరించదు. ( సాధారణంగా ముగ్గులో లైమ్ పౌడర్ కలుపుతారు. ఈ లైమ్ పౌడర్ ప్రభావం వలన ఎటువంటి క్రిమి కీటకాలు మనం వండుకునే పొయ్యి దగ్గరకి రావు. దాని వలన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు )
Loading...

Popular Posts