మున‌గ చెట్టు ఆకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు.. ఈ చెట్టు ఆకు ర‌సాన్ని తాగితే షుగ‌ర్, క్యాన్స‌ర్ పరార్

Loading...
ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం క‌లిగిందంటే చాలు మెడిక‌ల్ షాపుకో, ఆస్ప‌త్రికో ప‌రుగెత్త‌డం, మందుల‌ను వాడ‌డం నేడు ఎక్కువైపోయింది. కానీ మీకు తెలుసా..? ఎలాంటి అనారోగ్యానికైనా మ‌న చుట్టు ప‌క్క‌ల ఉండే మొక్క‌లు, వృక్షాల్లో ఏదో ఒక‌టి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుందని..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలాంటి చెట్ల‌లో ఒక‌టే మున‌గ చెట్టు. దీనికి చెందిన ఆకుల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు మ‌న‌కు క‌లిగే స్వ‌ల్ప అనారోగ్యాల‌ను మాత్ర‌మే కాదు, ప‌లు ర‌కాల మొండి వ్యాధుల‌ను కూడా న‌యం చేయ‌గ‌లుగుతాయి. ఈ క్ర‌మంలో మున‌గాకు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పోష‌కాల గ‌ని
మున‌గ చెట్టు ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం మున‌గ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి.
దృఢ‌మైన ఎముక‌ల‌కు
మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ట‌యితే దాంతో శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో ఎముక‌లకు బ‌లం చేకూరుతుంది. అవి దృఢంగా మారుతాయి.
క్యాన్స‌ర్‌ను నిరోధిస్తుంది
మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి.
కంటి సంబంధ స‌మ‌స్య‌లు
కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి. 
మ‌ధుమేహానికి
మున‌గ చెట్టు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.
ర‌క్త శుద్ధికి, వృద్ధికి
మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.
యాంటీ ఏజింగ్‌
మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి.
Loading...

Popular Posts