మన దేశంలో తక్కువ బడ్జెట్ తో హ్యాపీగా, జాలీగా ఎంజాయి చేసే అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశాలు

Loading...
ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? టూర్ తక్కువ బడ్డెట్ లో కావాలి, అదే టైమ్ లో మంచి ప్రదేశాలను చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ 4 ప్రాంతాలను చుట్టేయండి, తక్కువ బడ్జెట్ లో…హ్యాపీగా, జాలీగా ఎంజాయి చేసేయొచ్చు.
1) గోవా:
మందు బాబులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది మంచి టూరిస్ట్ స్పాట్. గోవాకు చాలా ప్రాంతాల నుండి ప్రైవేట్ ట్రావెల్స్ డైరెక్ట్ బస్ లను నడుపుతాయి. 5-8 మంది ఫ్రెండ్స్ కలిసి సొంతంగా వెహికిల్ తీసుకెళ్లినా పర్వాలేదు. బీచ్ లలో కూర్చొని…అలా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతత కావాలి అంటే మార్జిమ్ బీచ్, క్రౌడ్ తో ఎంజాయి చేయాలంటే బాగా బీచ్ ను ఎంచుకోవాలి. క్రిస్టమస్, జనవరి ఫస్ట్, ఫిబ్రవరి 14….ఈ టైమ్ లో గోవా పర్యాటకులతో చాలా బిజీగా ఉంటుంది. సెల్ప్ రైడ్ చేసుకోడానికి రెంట్ బేసిస్ మీద కార్లు, టూ వీలర్స్ దొరకుతాయి. రష్యన్ టూరిస్ట్ లు ఎక్కువ.
చూడదగ్గ ప్రదేశాలు: బీచ్ లు, బామ్ జీసస్ బసిలికా, పాంజిమ్‌లోని ఫౌంటెన్‌హాస్, మంగ్వేషి మందిరం.
టేస్ట్ చేయదగ్గ పదార్థాలు: జీడి మామిడి పండునుంచి, కొబ్బరి కల్లునుంచి తయారు చేసే ఫెని అనే మద్యం గోవాలో చాలా ఫేమస్., సీఫుడ్ .
2) పాండిచ్చేరి:

తమిళనాడు+ ఆంధ్రప్రదేశ్ లోని కొంతకొంత భాగాలతో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం. ఇది కూడా మంచి పర్యాటక ప్రాంతం.
చూడదగ్గ ప్రదేశాలు:
2004 లో వచ్చిన ‘సునామీ’లో పుదుచ్చేరి నగరాన్ని రక్షించిన 1.5 KM ల కరకట్ట. దీన్ని 1735లో నిర్మించారు.
ఆరొవిల్లిలో నిర్మించిన అరవిందాశ్రమం – ప్రధాన పర్యటనా కేంద్రం, తాత్విక అధ్యయనా స్థానం.
లిటిల్ ఫ్రాన్స్ ఆఫ్ ఇండియా-పుదుచ్చేరి.
ప్రెంచ్ +ఇండియా సంస్కృతిని ప్రతిబింబించే అనేక కట్టడాలు.
సెరినిటీ బీచ్
బొటానికల్ గార్డెన్.
టేస్ట్ చేయదగ్గ పదార్థాలు: సీఫుడ్స్, Ratatouille, Bouillabaisse, Sole Meunière, Quiche ( ఇవన్నీ ఫ్రాన్స్ ఫేమస్ ఫుడ్స్…ఇవి పుదుచ్చేరి లో దొరకుతాయి.)
3) గోకర్ణ.
ఆధ్యాత్మికం+ పర్యాటకం…రెండు విధాలుగా ఎంజాయి చేయాలనుకునే వారికి ఈ ప్లేస్ కరెక్ట్ సూటెబుల్. సుందరమైన బీచ్ లతో పాటు ప్రసిధ్ద శైవక్షేత్రం కూడానూ. స్టే చేయడానికి తక్కువ రేట్లలో లాడ్జీలు లభిస్తాయి. ఇది గోవాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి. గోవాను సందర్శించాలనుకునే వాళ్లు…పనిలోపనిగా దీనిని చూడొచ్చు.
భద్రకాళి, గణపతి దేవాలయాలు.
అర్థ చంద్రకార బీచ్ (హాఫ్ మూన్ బీచ్)
గోకర్ణలో కోటి తీర్థం
టేస్ట్ చేయదగ్గ పదార్థాలు: వెజ్ కు వెజ్- సీ పుడ్స్ కు సీ ఫుడ్స్… అందించే ఓ నాలుగు ఫేమస్ రెెస్టారెంట్స్ ఉన్నాయి. అవి: డాల్ఫిన్ రెస్టారెంట్, సూర్య రెస్టారెంట్, నమస్తే రెస్టారెంట్, ఓం రెస్టారెంట్.
4)వారణాసి:
భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని నమ్మకం.
చూడదగ్గ ప్రదేశాలు:
అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి.
సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది.
ప్రతీ వీధిలోనూ కనిపించే దేవాలయాలు.
18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ నిర్మించిన రామనగర్ కోట, ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది.
టేస్ట్ చేయదగ్గ పదార్థాలు: కచోరి, లస్సీ, ఛాట్…తో పాటు కొన్ని ఉత్తరభారత దేశ వంటకాలు టేస్ట్ చేయొచ్చు.
Loading...

Popular Posts