అత్తమామలను చూడని భార్యకు భర్త విడాకులు ఇచ్చేయచ్చని సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు

హిందూ కుటుంబాల్లో కొడుకుకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది.. అటువంటి కొడుకుని పెళ్లి చేసుకొని వచ్చిన భార్య తన అత్తమామ పట్ల బాధ్యతగా మెలగాలి.. కోడలుగా వారిని ఆదరించాలి.. అంతేగానీ.. తన భర్త తనకు మాత్రమే సొంతం అని అతని కష్టార్జితం తను ఒక్కదానినే అనుభవించాలనే భావనతో భర్త నుంచి అతని తల్లిదండ్రులను విడదీయాలని చూసే భార్యలకు... అత్తమామలను ఆదరించడానికి సుముఖత చూపని మహిళలకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది...... 

తల్లిదండ్రులను గాలి కొదిలేయమని వేధించే భార్యలకు నిర్మొహమాటంగా విడాకులిచ్చేయచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రటించింది.
భారత దేశంలో సాధారణంగా మహిళ వివాహం చేసుకొని అతని కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తుంది. కానీ మన సంస్కృతిని కాదని భర్త సంపాదన తనదే అని ఇటీవల స్త్రీలు భావిస్తున్నారని... అది కరెక్ట్ కాదని.. భార్య పెళ్లి తర్వాత కుటుంబంతో ఆమెకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది... అంతేకాదు ఆమె భర్త యొక్క కుటుంబంలో ఒక భాగం.. కాగా ఎటువంటి సమర్థనీయమైన... బలమైన కారణం లేకుండా సాధారణంగా, ఆమె తన భర్త కుటుంబం నుండి తన భర్తని వేరుగా తీసుకొని వెళ్ళాలి అని అనుకొంటే...
అటువంటి భార్యనుంచి భర్త విడాకులు తీసుకోవచ్చు అని జస్టిస్ దేవ్, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.


" కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తికి వివాహమయ్యాక.. భార్య వేరే కాపురం పెట్టాలనుకోవడం చాలా తప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దచేసి చదివించినప్పుడు.. వివాహమయ్యాక కన్నవారిని పోషించడం వారి బాధ్యత. వృద్ధాప్యంలో వారి వద్ద డబ్బు ఉన్నా లేకపోయినా చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిపైనే ఉంటుంది " అని జస్టిస్‌ దేవ్ తన తీర్పులో పేర్కొన్నారు. 
అంతేగాక, వివాహమయ్యాక వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఆలా చేయడం విదేశీ సంస్కృతి అని.. ఇక్కడి పరిస్థితులకు సరిపోదని పేర్కొంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)