బార్ అండ్ రెస్టారెంట్ లలో స్టఫ్ కోసం నాన్ వెజ్ తింటున్నారా ? తాగిన మత్తులో ఏమీ అర్ధంకాదులే అని దారుణాలు చేస్తున్నారు జాగ్రత్త !

బార్లలో మందు తాగి స్టఫ్ తినే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కుళ్ళిపోయిన చికెన్, నిల్వ ఉన్న పదార్థాలను ఫ్రయ్ చేసి అమ్ముతూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేయగా ఈ విషయం వెల్లడైంది. కాబట్టి తాగిన మత్తులో స్టఫ్ ఆర్డర్ చేసే ముందు జాగ్రత్త వహించకపొతే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. 

బార్ అండ్ రెస్టారెంట్ లలో నాన్ వెజ్ తిని మీ ఆరోగ్యంను చేతుల్లారా నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని డాక్ట‌ర్‌లు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు. చ‌నిపోయి కుళ్లిన జంతుక‌ళేభ‌రాల మ‌రుగ‌బెట్టి వాటి నుంచి తీస్తున్న నూనేలు, నెయితో పాటు ర‌క‌ర‌కాల నాసిర‌కం, న‌కిలీల పుణ్యమా మీ ఆరోగ్యం గంగ‌లో కల‌వ‌డం ఖాయంగా మారింది. మందు తాగేటప్పుడు మాంసాహారానికి అలవాటయిపోయిన జీవితాలు చాలానే ఉన్నాయి. సో మందులో నాన్ వెజ్ తినాలంటే ఇంట్లోనే వండించుకోవడం ఉత్తమమైన మార్గం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)