జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు బాగా రావాలంటే మనం ఈ చిన్న చిన్న అలవాట్లకు దూరంగా ఉండాలి

Loading...
 • ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి మ‌నిషికి కొన్ని మంచి అల‌వాట్లు ఉంటాయి. వాటితోపాటు కొన్ని చెడు అల‌వాట్లు కూడా ఉంటాయి. చెడు అల‌వాట్లంటే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటివే కాదు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి. అయితే వాటిని చాలా మంది చెడు అల‌వాట్లుగా భావించ‌రు. కానీ, నిజానికి ఆ అలవాట్లు కూడా చెడు అల‌వాట్లే. జ్యోతిష్య‌శాస్త్రం ప‌రంగానే కాదు, ప‌రిశుభ్ర‌త ప‌రంగా చూసినా కూడా కొన్ని అల‌వాట్లు చెడు అల‌వాట్లుగానే ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. వీటి వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డ‌తారు కూడా. అయితే దీంతోపాటు అలాంటి కొన్ని చెడు అల‌వాట్ల వ‌ల్ల ధనం కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. జ్యోతిష్య‌శాస్త్రంలో దీని గురించి పేర్కొన‌డం జ‌రిగింది కూడా. ఇంత‌కీ మ‌నం ఆచ‌రించ‌కూడ‌ని ఆ చెడు అల‌వాట్లు ఏంటంటే..!
 • బాత్‌రూంను ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే దాని వ‌ల్ల అనారోగ్యాలు వ్యాప్తి చెంద‌డ‌మే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం చంద్రుడు అశుభ దృష్టితో చూస్తాడు. దీంతో ధ‌నం కోల్పోవాల్సి వ‌స్తుంది.
 • చెప్పులు, షూస్ వంటి వాటిని ఇంటి బ‌య‌ట ప్ర‌త్యేక‌మైన అర‌లో శుభ్రంగా పెట్టుకోవాలి. లేదంటే వాటి వ‌ల్ల ఇంట్లోకి నెగెటివ్ శ‌క్తి ప్ర‌సార‌మై అది ఇంట్లో ఉన్న‌వారికి న‌ష్టం క‌లిగిస్తుంది.
 • ప్ర‌తి వ్య‌క్తి త‌న పాదాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేక‌పోతే నెగెటివ్ శ‌క్తి ప్ర‌సార‌మై వారికి జీవితంలో అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయి. వారికి ఎల్ల‌ప్పుడూ స‌మ‌స్య‌లే వ‌స్తాయి.
 • బెడ్‌రూంను, బెడ్‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా, నీట్‌గా పెట్టుకోవాలి. లేదంటే అలాంటి వారికి ఎప్పుడూ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఇంట్లోకి అంతా నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది.
 • ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారం మొత్తాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిగిల్చ‌కూడ‌దు. మిగిలిస్తే ల‌క్ష్మీ దేవికి ఆగ్ర‌హం వ‌చ్చి సంప‌ద కోల్పోయేలా చేస్తుంది.
 • పెద్ద గొంతుక‌తో ఎల్ల‌ప్పుడూ మాట్లాడ‌కూడ‌దు. లేదంటే మ‌నం చేసిన మంచి ప‌నుల వ‌ల్ల వ‌చ్చే పుణ్యం అంతా పోతుంది.
 • వంట గ‌దిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేక‌పోతే ఆ ఇంటికి మంగ‌ళ‌క‌రంగా ఉండ‌దు.
 • ఆల‌స్యంగా ఎల్ల‌ప్పుడూ నిద్రించ‌కూడ‌దు. ఆల్య‌సంగా నిద్రిస్తే అది శ‌రీరానికే కాదు, మ‌న‌స్సుకు కూడా ప్ర‌భావం క‌లిగిస్తుంది. అలాంటి వారికి అన్నీ మాన‌సిక‌, శారీర‌క స‌మ‌స్య‌లే క‌లుగుతాయి.
 • ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఉమ్మి వేయ‌కూడ‌దు. అలా చేస్తే ల‌క్ష్మీ దేవికి కోపం వ‌చ్చి ధనం అంతా పోయేలా చేస్తుంది.
 • పెద్ద‌ల‌ను అస్స‌లు తిట్ట‌కూడ‌దు. నిందించ‌కూడ‌దు. అలా చేస్తే అలాంటి వారికి అన్నీ ఆర్థిక స‌మ‌స్య‌లే క‌లుగుతాయి.
Loading...

Popular Posts